Omicron Virus: ఒమిక్రాన్ పేరు చెప్పగానే ప్రపంచ దేశాల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. భారత్‌లో థర్డ్ వేవ్‌కు కొత్త వేరియంట్ కారణమైంది. తాజాగా ఒమిక్రాన్‌పై రష్యన్ శాస్త్రవేత్తలు షాకింగ్ న్యూస్‌ను వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్‌లో మరో రెండు ఉపవేరియంట్లను గుర్తించినట్లు ప్రకటించారు. ఒమిక్రాన్‌తో పోలిస్తే వీటికి వ్యాప్తి చెందే సామర్థ్యం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
వీటికీ బీఏ.4, బీఏ.5గా నామాకరణం చేశారు. మే నెలలో వైరస్‌కు సంబంధించిన నమూనాలను సేకరించారు. నమూనాల్లో వీటిని గుర్తించినట్లు రోస్పోట్రెబ్ నడ్జోర్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎపిడెమాలజీ తెలిపింది. ఈమేరకు రీసెర్చ్ అధిపతి కమిల్ ఖఫిజోన్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రష్యాలో బీఏ.2 ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రంగా ఉంది. వ్యాక్సిన్ అందుబాటులో లేని దేశాల్లో కరోనా విజృంభిస్తోంది.
దక్షిణకొరియాలో దశల వారిగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఆయా దేశాల్లో ఒమిక్రాన్ ఉపవేరియంట్లు మరోసారి పంజా విసిరే అవకాశం ఉందని ప్రపంచ ఆర్యో సంస్థ హెచ్చరిస్తోంది. ఇటు భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా రెండోరోజూ 8 వేలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 8 వేల 582 మందికి వైరస్ సోకింది. నలుగురు మృత్యువాత పడ్డారు.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల 32 లక్షల 22 వేల 17కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 44 వేల 513గా ఉంది. ఇటు రోజువారి పాజిటివిటీ రేటు 2.71 శాతానికి చేరింది. తాజాగా కరోనా నుంచి కోలుకుని 4 వేల 435 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 194.9 కోట్ల మందికి టీకా అందించారు. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ అందిస్తున్నారు.
Also read: Mahesh Babu Aishwara Rai: మహేష్ బాబు సరసన ఐశ్వర్య రాయ్..? రాజమౌళి సినిమాలో క్రేజీ కాంబినేషన్..
Also read:President election: వెంకయ్య నాయుడికి నిరాశే.. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. ఉప రాష్ట్రపతిగా నక్వీ?
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి