Russia Bans Facebook, Tiwtter and Google News: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యల కొనసాగుతోంది. నెలరోజులగా జరుగుతున్న భీకర దాడుల్లో ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం నెలకొంది. మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుస బాంబు దాడుల కారణంగా ఆ దేశం తీవ్రంగా నష్టపోయింది. ఇటు రష్యా సైతం తమ సైనికులను భారీగానే కోల్పోయింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ భద్రత దళాలు ఇటీవలే ధృవీకరించాయి. రష్యా తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇరు దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రష్యాకు ఇతర దేశాల నుండి సాహయం అందకపోవటంతో దిగుమతులు అన్ని తగ్గిపోయిన సంగతి తెలిసిందే. అటు ఉక్రెయిన్ ప్రజలు ప్రాణభయంతో ఇతర దేశాలకు వలసపోతున్న సంగతి కూడా తెలిసిందే. రష్యాతో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పష్టం చేశారు.
ఈక్రమంలోనే ఫేస్‌బుక్, ట్విట్టర్‌పై రష్యా నిషేధం విధించింది. తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు పుతిన్. గూగుల్ వార్తలను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు రష్యా కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ ఓ ప్రకటనలో తెలిపింది. తమ దేశానికి వ్యతిరేకంగా వార్త ప్రసారాలు చేస్తే వారికి జైలు శిక్ష తప్పదని పుతిన్ సర్కార్ స్పష్టం చేసింది.
రష్యన్లను కించపరిచేలా ప్రసారాలు చేయకూడదని తేల్చి చెప్పింది. రష్యా మిలటరీని సైతం అగౌరవ పరిస్తే కఠిన చర్యలు తప్పదని పుతిన్ సర్కార్ తెలిపింది. భీకర యుద్ధంపై తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకే పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook