Russia-Ukraine War: రష్యన్ ఆర్మీకు షాక్ ఇస్తున్న ఉక్రెయిన్, చేజారిన భూభాగాలు స్వాధీనం

Russia-Ukraine War: రష్యా -ఉక్రెయిన్ యుద్ధంలో పరిస్థితి మారుతోంది. మొన్నటివరకూ రష్యాది పైచేయిగా ఉంటే..ఇప్పుడు ఉక్రెయిన్ బలగాలు దూసుకుపోతున్నాయి. చేజారిన ప్రాంతాల్ని తిరిగి కైవసం చేసుకుంటున్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 17, 2022, 07:03 PM IST
Russia-Ukraine War: రష్యన్ ఆర్మీకు షాక్ ఇస్తున్న ఉక్రెయిన్, చేజారిన భూభాగాలు స్వాధీనం

Russia-Ukraine War: రష్యా -ఉక్రెయిన్ యుద్ధంలో పరిస్థితి మారుతోంది. మొన్నటివరకూ రష్యాది పైచేయిగా ఉంటే..ఇప్పుడు ఉక్రెయిన్ బలగాలు దూసుకుపోతున్నాయి. చేజారిన ప్రాంతాల్ని తిరిగి కైవసం చేసుకుంటున్నాయి..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 7 నెలలు కావస్తోంది. రష్యా ఎంతగా ప్రయత్నించినా ఉక్రెయిన్ లొంగడం లేదు. ప్రాంతాలు కోల్పోతున్నా, ప్రాణనష్టం జరుగుతున్నా ఎదురొడ్డి పోరాడుతున్నాయి ఉక్రెయిన్ బలగాలు. మొన్నటివరకూ రష్యాది పైచేయిగా ఉంటే..ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఉక్రెయిన్ బలగాలు దూసుకుపోతూ రష్యాకు షాక్ ఇస్తున్నాయి.

ఉక్రెయిన్ సైన్యం ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతోంది. కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందేందుకు శత్రుదేశాన్ని చావుదెబ్బ కొడుతున్నాయి. ఇప్పటికే రష్యా సరిహద్దులో ఉన్న ఆగ్నేయ ఖార్కివ్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఓస్కిల్ నది, స్వాతోవే ప్రాంతాల మధ్య రష్యా ఏర్పాటు చేసిన రక్షణ వలయాన్ని ఉక్రెయిన్ నాశనం చేసింది. ఓ అంచనా ప్రకారం కోల్పోయిన భూభాగంలో మెజార్టీ ప్రాంతాన్ని తిరిగి కైవసం చేసుకుంది. 

ఉక్రెయిన్‌లోని ఇజియం నగరం నుంచి ఇప్పటికే రష్యా దళాలు వెనుదిరిగాయి. ఉక్రెయిన్ సైనికుల ధాటికి వెనుదిరిగి వెళ్లిపోయిన తరువాత ఆ ప్రాంతంలో 440 మృతదేహాల దిబ్బను గుర్తించారు. అందులో సైనికులు, పౌరులు, పిల్లలు ఉన్నారు. 

రష్యాను నియంత్రించేందుకు, రష్యా సైనికుల్ని తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా యుద్ధం చేస్తోంది. శత్రువు అలసిపోయేవరకూ నిరీక్షించి..ఎదురుదాడికి దిగుతోంది. 

Also read: Papua New Guinea: పపువా న్యూ గినియాలో భారీ భూకంపం... సునామీ హెచ్చరిక జారీ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News