సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా సేవలందించిన రాబర్ట్ ముగాంబే ఎట్టకేలకు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్లమెంట్ స్పీకర్ జాకబ్ ముడెండాకు అందించారు. ఆయన రాజీనామా ఆమోదించడంతో ముగాంబే అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. 1980లో జింబాబ్వేలో బ్రిటీష్ వలసవాదం ముగిసినప్పటి నుంచి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగారు. 93ఏళ్ల ఈ కురువృద్ధుడు జింబాబ్వే దేశాన్ని 37 ఏళ్లు పాలించాడు. గతవారమే ఆయన్ను ఆ దేశ సైన్యం గృహనిర్బంధం గావించి, అధికార పగ్గాలను హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే..! జింబాబ్వేలో ముగాంబే పాలనకు చరమగీతం పాడాలని దేశవ్యాప్తంగా ప్రజలు సామూహిక నిరసన ప్రదర్శనలు చేశారు. ఇక జింబాబ్వే కొత్త శకానికి నాంది పలకనుంది.
అధ్యక్ష పదవికి ముగాంబే రాజీనామా