Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు భారతీయ విద్యార్ధుల మృతి

Canada: కెనడా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐదుగురు భారతీయ విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 14, 2022, 09:56 AM IST
Canada: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు భారతీయ విద్యార్ధుల మృతి

Canada: కెనడా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఐదుగురు భారతీయ విద్యార్ధులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

కెనడాలోని ఒంటారియో హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ పాసింజర్ వ్యాన్, ట్రాలీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులు హర్‌ప్రీత్‌సింగ్, జస్పీందర్‌సింగ్, కరణ్‌పాల్ సింగ్, మోహిత్ చౌహాన్‌, పవన్‌కుమార్‌గా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు..ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని భారత రాయబారి అజయ్ బిసారియా ట్విట్టర్‌లో తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతదేహాలను త్వరంగా భారత్‌కు తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయాన్ని బాధితుల కుటుంబాలకు తెలియజేసినట్లు వెల్లడించారు. 

Also read: Barak Obama: అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు కరోనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News