North Korea: కిమ్ గొప్పతనం తెలుసుకోవడానికి పిల్లలకు 90 నిమిషాల ప్రత్యేక క్లాసులు

ఉత్తర కొరియాలో ( North Korea ) పిల్లలకు సరికొత్త పాఠాలు నేర్పుతున్నారు. ఈ పాఠాలు వారు జీవితాంతం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అని అక్కడ అధికారులు చెబుతున్నారు. 

Last Updated : Sep 20, 2020, 06:48 PM IST
    • ఉత్తర కొరియాలో పిల్లలకు సరికొత్త పాఠాలు నేర్పుతున్నారు.
    • ఈ పాఠాలు వారు జీవితాంతం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అని అక్కడ అధికారులు చెబుతున్నారు.
    • దీని కోసం టీచర్లు చాలా కష్టపడుతున్నారు. మరి ఆ పాఠాలేంటో తెలుసా?
North Korea: కిమ్ గొప్పతనం తెలుసుకోవడానికి పిల్లలకు 90 నిమిషాల ప్రత్యేక క్లాసులు

ఉత్తర కొరియాలో ( North Korea ) పిల్లలకు సరికొత్త పాఠాలు నేర్పుతున్నారు. ఈ పాఠాలు వారు జీవితాంతం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అని అక్కడ అధికారులు చెబుతున్నారు. దీని కోసం టీచర్లు చాలా కష్టపడుతున్నారు. మరి ఆ పాఠాలేంటో తెలుసా? ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong-un) గొప్పతనం గురించి వర్ణించే అంశాలు.  ప్రీ స్కూల్ కరిక్యూలమ్ లో చిన్నపిల్లలకు కిమ్ ఎంత తెలివైనవాడో టీచర్లు తెలియజేస్తారు. ఐదు సంవత్సరాల పిల్లలు ఇక నీతి కథలు వినకుండా కిమ్ కథలను వింటారు.

ALSO READ| Trump Residency: బిజినెస్ ట్రంప్ బ్లెడ్ లోనే ఉంది... ఇల్లు రాజభవనం కన్నా తక్కువేం కాదు

కొత్త చట్టం ప్రకారమే

చిన్నపిల్ల నుంచి యువకుల నుంచి కిమ్ ఘనత గురించి కథలు కథలుగా విననున్నారు. దీనికి సంబంధించి ఉత్తర కొరియా ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రతీ రోజు 90  నిమిషాలు తప్పకుండా వారి సుప్రీం లీడర్ గొప్పతనం గురించి విషయాలు తెలుసుకుంటారు.

అయితే ఇలా కిమ్ గురించి క్లాసులు చెప్పడం అక్కడ ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు ప్రతీ రోజు 30 నిమిషాల పాటు క్లాస్ చెప్పేవాళ్లు. ఇకపై మరో 60 నిమిషాలు ఎక్కువగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. కేవలం కిమ్ గురించే కాదు. కిమ్ పూర్వికుల గురించి కూడా ఈ క్లాసుల్లో పాఠాలు చెబుతారు. ఈ సమయంలో ఉద్రేకాన్ని , జాతీయ భక్తి కలిగించే సంగీతాన్ని ప్లే చేస్తారట.

ALSO READ|  Driving at Night: డ్రైవింగ్ చేస్తోంటో నిద్ర వస్తోందా? ఇలా చేయండి

కిమ్ చెల్లెలు ఆదేశాలు

ఈ కొత్త నియమాన్ని కిమ్ జాంగ్ ఉన్ చెల్లెలు జారీ చేసిందట. కిమ్ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల కిమ్ చెల్లెలు కిమ్ యో జాంగ్ (  Kim Yo Jong ) ఇప్పుడు ఆదేశాలు జారీ చేస్తోంది. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రీస్కూల్స్ లో తప్పకుండా ఈ కొత్త పోర్షన్ ను చేర్చాలని చెప్పిందట కిమ్ చెల్లెలు.

ఉత్తర కొరియా నియంత కిమ్  తరువాత అతని చెల్లెలు ఆ దేశంలో రెండో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. కిమ్ కుటుంబం గొప్పతనం తెలిసే ఈ ప్రత్యేక పాఠాలను అక్కడి ప్రభుత్వం ఆగస్టు 25 నుంచి అమలులోకి తెచ్చింది. ఆ దేశ నాయకులపై ప్రజల్లో విశ్వాసం, గౌరవం పెరగడానికి ఈ పాఠాలు ఉపకరిస్తాయని వారు భావిస్తుున్నారు.

ALSO READ : GRAND ICT Challegne: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఛాలెంజ్ పూర్తి చేస్తే.. రూ.50 లక్షలు మీకే సొంతం

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News