Narendra Modi: ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ (Melania Trump) శుక్రవారం కరోనా వైరస్ బారిన పడ్డారు.

Last Updated : Oct 2, 2020, 12:45 PM IST
Narendra Modi: ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలి

PM Modi wishes Donald and Melania Trump: న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ (Melania Trump) శుక్రవారం కరోనావైరస్ (Coronavirus) బారిన పడ్డారు. తమకు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్‌ (Donald Trump Tests positive for COVID19) గా నిర్థారణ అయిందని అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ స్వయంగా కొద్దిసేపటి క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా దంతులు త్వరగా కోలుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ) ఆకాంక్షించారు. ఈ మేరకు మోదీ ట్విట్ చేశారు. 

ఈ సందర్భంగా మోదీ ఇలా రాశారు. తన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోని ఆరోగ్యవంతంగా ఉండాలని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ఇదిలాఉంటే.. తనకు, తన భార్య మెలానియాకు కరోనా పాజిటివ్ అని రావడంతో తాము క్వారంటైన్‌లో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌కు ప్రధాని మోదీ రీట్విట్ చేశారు.  Also read: Donald Trump Tests positive for COVID19: డొనాల్డ్ ట్రంప్, మెలానియాలకు కరోనా పాజిటివ్

ఇదిలాఉంటే.. ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర సలహాదారిణిగా సేవలందిస్తున్న హోప్ హిక్సు కరోనా వైరస్ బారిన పడింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. Also Read : Donald Trump: సిబ్బందికి కరోనా.. ట్రంప్ దంపతులకు కోవిడ్19 టెస్టులు

Trending News