కోవిడ్ 19 వ్యాక్సిన్ ( Covid19 Vaccine ) కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తున్న తరుణంలో ఆశాజనకమైన ప్రకటనలు వెలువడుతున్నాయి. నవంబర్ నాటికి వ్యాక్సిన్ రెడీ అంటోంది ప్రముఖ సంస్థ ఫైజర్.
కరోనా వ్యాక్సిన్ ( Corona Vaccine ) పై ఇప్పుడు స్పష్టత వస్తోంది. దీనికి కారణం పలు దేశాల్లో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మానవ పరీక్షలన్నీ దాదాపుగా తుదిదశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఫైజర్ ( Pfizer ) చేస్తున్న ప్రకటన ఊరటనిస్తోంది. తమ పరీక్షలన్నీ విజయవంతమైతే అక్టోబర్ నాటికి రెగ్యులేటరీ అనుమతులు లభిస్తాయని కంపెనీ చెబుతోంది. నవంబర్ నాటికే వ్యాక్సిన్ తయారీ, సరఫరా ప్రారంభమవుతుందని ఫైజర్ సంస్థ సంకేతాలు పంపుతోంది. ఏడాది చివరికి 5 కోట్ల మందికి రెండు రోసుల వ్యాక్సిన్ సరఫరా చేయగలమని ఫైజర్ ప్రకటించింది. 2021 చివరికి 130 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని సరఫరా చేసేందుకు ఫైజర్ సిద్ధమవుతోంది. 5 కోట్ల మందికి 15 వేల కోట్ల రూపాయలకు వ్యాక్సిన్ ను విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వంతో ( America Government ) ఫైజర్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. Also read: WFH: వాళ్లకు మరో ఏడాది పాటు వర్క్ ఫ్రమ్ హోమ్
అటు 2021 నుంచి ఏడాది వ్యవధిలో 100 కోట్ల వరకూ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో తీసుకువచ్చే దిశగా మోడెర్నా ( Moderna ) ప్రయత్నాలు చేస్తోంది. వ్యాక్సిన్ భద్రత, సామర్ద్యం పరీక్షించేందుకు ఫైజర్, మోడెర్నా కంపెనీలు 30 వేల మందిపై మానవ పరీక్షలు చేస్తున్నాయి. ఇంకోవైపు జాన్సన్ అండ్ జాన్సన్ సైతం మానవ పరీక్షలకు సిద్ధమవుతోంది. Also read: Corona Virus: ఆ దేశంలో తొలి కరోనా కేసు