కోవిడ్ ట్యాబ్లెట్స్‌పై ఫైజర్ కీలక నిర్ణయం, ఇతర కంపెనీలకు అనుమతులు

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఫైజర్ అభివృద్ధి చేసిన కోవిడ్ యాంటీ వైరల్ మందుల విషయంలో కీలకమైన అప్‌డేట్ ఇది.  ఇతర కంపెనీలకు పేటెంట్ విషయంలో ఫైజర్ కీలక నిర్ణయం తీసుకుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 17, 2021, 03:15 PM IST
కోవిడ్ ట్యాబ్లెట్స్‌పై ఫైజర్ కీలక నిర్ణయం, ఇతర కంపెనీలకు అనుమతులు

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఫైజర్ అభివృద్ధి చేసిన కోవిడ్ యాంటీ వైరల్ మందుల విషయంలో కీలకమైన అప్‌డేట్ ఇది.  ఇతర కంపెనీలకు పేటెంట్ విషయంలో ఫైజర్ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్(Coronavirus) మహమ్మారి నియంత్రణకు ప్రస్తుతం ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. ఇప్పుడు కొత్తగా ప్రముఖ అమెరికన్ కంపెనీ ఫైజర్ యాంటీ వైరల్ మందుని అభివృద్ధి చేసింది. ఈ కొత్త యాంటీ వైరల్ ట్యాబ్లెట్లను తామే అభివృద్ధి చేసినా..ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కీలకమైన నిర్ణయం తీసుకుంది ఫైజర్. ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన యాంటీ వైరల్ మాత్రలపై రాయల్టీ వదులుకునేందుకు సిద్దమైంది. ఐక్యరాజ్యసమితి మద్దతు కలిగిన జెనీవాకు చెందిన మెడిసిన్స్ పేటెంట్ పూల్ బృందంతో ఒప్పందం కుదుర్చుకుంది. యాంటీ వైరల్ ట్యాబ్లెట్స్ తయారు చేసేందుకు ఆ బృందానికి ఫైజర్ కంపెనీ లైసెన్స్ మంజూరు చేసింది. ఎంపీపీ సంస్థ తక్కువ ధరలకే నిరుపేద దేశాలకు మందుల్ని పంపిణీ చేస్తోంది. 

ఫైజర్(Pfizer) చేసుకున్న ఒప్పందం ద్వారా ప్రపంచ జనాభాలో 53 శాతం మందికి కోవిడ్ మాత్రలు అందుబాటులో రానున్నాయి. ఫైజర్ కంపెనీ రాయల్టీని వదులుకోవడం వల్ల 95 దేశాల్లో ఈ మాత్రల్ని అత్యంత చౌక ధరలకే పంపిణీ చేయవచ్చు. మరి కొద్దిరోజుల్లోనే ఈ మాత్రలు మార్కెట్‌లో రానున్నాయని తెలుస్తోంది. 

Also read: ఐరాసలో పాకిస్తాన్ చెంప చెళ్లుమనిపించిన భారత ప్రతినిధి డాక్టర్ కాజల్ భట్ .. వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News