Pegasus Spyware: పెగసస్ ప్రమాదకరమే, ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా

Pegasus Spyware: వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై ఇజ్రాయిల్ కంపెనీ స్పందించింది. ప్రపంచం నిర్భయంగా ఉండటానికి కారణం పెగసస్ సాఫ్ట్‌వేర్  అని అంటోంది. అటు అమెరికా మాత్రం ఈ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 25, 2021, 12:23 PM IST
Pegasus Spyware: పెగసస్ ప్రమాదకరమే, ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా

Pegasus Spyware: వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై ఇజ్రాయిల్ కంపెనీ స్పందించింది. ప్రపంచం నిర్భయంగా ఉండటానికి కారణం పెగసస్ సాఫ్ట్‌వేర్  అని అంటోంది. అటు అమెరికా మాత్రం ఈ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ఇజ్రాయిల్‌కు(Izrael)చెందిన పెగసస్ కంపెనీ రూపొందించిన స్పైవేర్ సాఫ్ట్‌వేర్ (Spyware Software) వివాదాస్పదమైంది. ఇండియా సహా ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలు పెగసస్ ద్వారా రాజకీయ నేతలు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసి నిఘా పెట్టారంటూ మీడియా కథనాలతో వ్యవహారం సంచలనంగా మారింది. దాంతో సాఫ్ట్‌వేర్ రూపొందించిన ఎన్ఎస్‌ఒ గ్రూపు స్పందించింది. సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా సమర్ధించుకొచ్చింది.ఇటువంటి నిఘా సాఫ్ట్‌వేర్‌లు ఇంటెలిజెన్స్,పోలీసుల చేతుల్లో ఉండటం వల్లనే ప్రపంచం హాయిగా నిద్రపోతోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ సంస్థలకు ఒకసారి ఆ సాఫ్ట్‌వేర్‌ను విక్రయించిన తరువాత తాము ఆ స్పైవేర్‌ను(Pegasus Spyware) ఆపరేట్ చేయమని..అసలు తమకు యాక్సెస్ ఉండదని తెలిపింది.పెగసస్ వంటి సాంకేతిక పరిజ్ఞానం వల్ల నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించగలమని..భద్రతా వ్యవస్థకు చాలా ఉపయోగపడుతున్నాయని ఎన్ఎస్ఒ వెల్లడించింది.

మరోవైపు అమెరికా మాత్రం ఈ సాఫ్ట్‌వేర్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. పౌర సమాజంపై, ప్రభుత్వాన్ని విమర్శించేవారిపై పెగసస్ నిఘా అనేది ఆందోళన కల్గించే అంశమని అభిప్రాయపడింది. మానవహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, విపక్ష నేతల గోప్యతకు భంగం కలిగేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించింది.ఇండియాలో మొత్తం 3 వందల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసేందుకు పెగసస్ సాఫ్ట్‌వేర్(Pegasus Software)వినియోగించారంటూ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇదంతా భారత ప్రజాస్వామ్యాన్ని(Democracy) దెబ్బతీసేందుకేనని అమెరికా స్పష్టం చేసింది. 

Also read: Covaxin Deal: బ్రెజిల్ దేశంతో కోవాగ్జిన్ డీల్ రద్దు చేసుకున్న భారత్ బయోటెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News