Nuclear Attack: ఇండియాపై పాకిస్తాన్ న్యూక్లియర్ దాడికి ప్రయత్నాలు, సంచలనంగా మారిన మైక్ పాంపియో వ్యాఖ్యలు

Nuclear Attack: ఇండియాపై పాకిస్తాన్ న్యూక్లియర్ దాడికి సిద్ధమైందా..అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 25, 2023, 10:22 AM IST
Nuclear Attack: ఇండియాపై పాకిస్తాన్ న్యూక్లియర్ దాడికి ప్రయత్నాలు, సంచలనంగా మారిన మైక్ పాంపియో వ్యాఖ్యలు

అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. నెవర్ గివ్ యాన్ ఇంచ్ పుస్తకంలో రాసిన విషయాలు ఇండియా-పాకిస్తాన్ సంబంధాలను మరోసారి ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. 

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో భారతదేశం-అమెరికా మధ్య సత్సంబంధాలు ఉండేవి. అప్పటి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తరచూ ఇండియా వ్యవహారాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. ఆయన రాసిన పుస్తకం నెవర్ గివ్ యాన్ ఇంచ్ ఇప్పుడు సంచలనంగా మారింది. కారణం ఆ పుస్తకంలో రాసిన కొన్ని సంచలన విషయాలే. 2019 ఫిబ్రవరిలో బాలాకోట్‌లో ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తరువాత పాకిస్తాన్..ఇండియాపై అణుదాడికి సిద్ధమైందంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్ అణుదాడికి సంబంధించిన సమాచారాన్ని తనకు అప్పటి ఇండియా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అందించారన్నారు మైక్ పాంపియో. నెవర్ గివ్ యాన్ ఇంచ్, ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్ పుస్తకంలో ఈ విషయాల్ని ఆయన ఉదహరించారు. 

2019 ఫిబ్రవరి 27-28 తేదీల్లో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన సమయంలో తాను అమెరికా-ఉత్తర కొరియా శిఖరాగ్ర సమావేశం నిమిత్రం హనోయిలో ఉన్నానన్నారు ఆ తరువాత తన టీమ్..ఢిల్లీ, ఇస్లామాబాద్‌తో మాడ్లాడిందని చెప్పారు. ఆ సమయంలో పాకిస్తాన్ అణుదాడికి ఎంత సమీపంలో వచ్చిందో ఈ ప్రపంచానికి తెలియకుండా లేదన్నారు. 

వియత్నాంలోని హనోయిలో ఆ రాత్రిని తాను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు మైక్ పాంపియో. పాకిస్తాన్ అణుదాడి ప్రయత్నాల గురించి తాను అప్పటి పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాతో మాట్లాడినట్టు చెప్పారు. ఇండియా ఏం చెప్పిందో తాను పాంపియోకు చెబితే..అది తప్పని బజ్వా ఖండించినట్టు చెప్పారు. అయితే మైక్ పాంపియో ఈ వాదనపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించలేదన్నారు. ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడిలో 40 మంది భారత సైనికులు అమరులవడంతో..అందుకు ప్రతీకారంగా ఇండియా బాలాకోట్‌పై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. 

Also read: Earthquake: ఇండోనేషియాలో మళ్లీ కంపించిన భూమి, భయంతో జనం పరుగులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News