Can Imran Khan Be Hanged Details: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాపం పడిందో కానీ ఆయన చేసిన పనులన్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయనను మరింత చీకటిలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికే దేశం రహస్యాలను లీక్ చేసినందుకు పదేళ్ల జైలు, భార్యతో కలిసి ప్రభుత్వ బహుమతులను అమ్ముకున్నందుకు మరో పద్నాలుగేళ్ల జైలు శిక్ష ను కోర్టు విధించింది. ప్రస్తుతం ఆయన రెండు శిక్షలు కలిపి అనుభవిస్తున్నారు.
Read More: Garuda Puranam: జీవితంలో ఈ 4 పనులు చేసినవారికి మరణానంతరం మోక్షమార్గమేనట..!
ఇదిలా ఉండగా ఇటీవల మరోసారి.. ఆయన నిఖానామాకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారని కూడా బైటపడింది. ఆయన భార్య బాష్రా బీబీని ఇద్దత్ చట్టాలకు వ్యతిరేంగాపెళ్లి చేసుకున్నారని ఘటన కూడా రుజువైంది. దీంతో కోర్టు మరల ఏడేళ్ల శిక్ష ను విధించిన విషయం తెలిసిందే. ఎలా చూసిన ఆయన ముఫైకి పైగా ఏళ్లు జైలులోనే శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ కు ప్రస్తుతం డెభ్బై ఏళ్లు. అంతే కాకుండా.. పాక్ లో ఫిబ్రవరి ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం కొత్తగా ఆయనను ఉరితీయవచ్చనే వార్తలు కూడా ఒక్కసారిగా వైరల్ గా మారాయి.
పాక్ లో ఫిబ్రవరి 8 న ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఇమ్రాన్ ఖాన్ మాత్రం స్వయంగా ఓటు వేయడానికి అనర్హుడని ప్రకటించారు. అయితే మద్దతుదారులలో తనకున్న ఆదరణ అలాగే ఉందని, తన పార్టీ అధికారంలోకి వస్తుందని ఇమ్రాన్ మాత్రం ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ పార్టీ .. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు సవాలుతో కూడిన పనిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
పాక్ ఆర్మీ చట్టాల ప్రకారం..
- ఇమ్రాన్‌ఖాన్‌పై దాదాపు 150 కేసులు ఉన్నాయి. అత్యంత తీవ్రమైనది మే 2023లో నమోదైన కేసు. అందులో అతను దోషిగా తేలితే మరణశిక్ష విధించవచ్చు. మే 2023లో అల్ ఖదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్టయిన తర్వాత, అతని మద్దతుదారులు ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేసి, తగలబెట్టారు.
- పిటిఐ సభ్యులు రావల్పిండిలోని వివిధ ప్రాంతాల్లోని పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలపై, ప్రధాన కార్యాలయంపై కూడా దాడి చేశారు. మే 9 హింసాకాండ కేసులో, ఇమ్రాన్ ఖాన్‌తో సహా 100 మందికి పైగా నిందితులు, ఉగ్రవాదానికి సంబంధించిన చట్టాల కింద అభియోగాలు మోపారు.
- ఇది పాకిస్థాన్‌పై యుద్ధం కేసుగా పరిగణించబడుతుంది. పాకిస్థాన్ ఆర్మీ చట్టంలోని సెక్షన్ 59 ప్రకారం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకుని, పాకిస్థాన్ సైన్యం లేదా భద్రతా బలగాలపై దాడి చేసే ఎవరైనా మరణశిక్ష విధించవచ్చు.
- మిలటరీ కోర్టులో మే 9న కేసు నడుస్తోంది. అయితే ప్రస్తుతం మిలటరీ కోర్టు తీర్పును ప్రకటించకుండా పాకిస్థాన్ సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ తెరిచిన విధంగా, అతను మే 9 హింసకు సూత్రధారిగా పరిగణించబడ్డాడు.
- హింసను ప్రేరేపించినందుకు ఇమ్రాన్ ఖాన్‌ను బాధ్యులను చేస్తూ ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మే 9న జరిగిన హింసాకాండను పిటిఐ పరువు తీసేందుకు జరిగిన కుట్ర అని ఆయన అభివర్ణించారు.
- నవాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ మధ్య లండన్‌లో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ కుట్ర గురించి చర్చించినట్లు ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. నవాజ్ షరీఫ్‌ను అధికారంలోకి తీసుకురావడానికి పాక్ సైన్యం ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు.
పార్టీ అంతర్గత ఎన్నికలు సకాలంలో నిర్వహించనందున ఇమ్రాన్‌ఖాన్ పార్టీ చిహ్నం క్రికెట్ బ్యాట్‌ను లాక్కున్నారు. పీటీఐ ప్రధాన కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
- ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఓటు వేయడానికి అనర్హుడని ప్రకటించారు. అయితే మద్దతుదారులలో తనకున్న ఆదరణ అలాగే ఉందని, తన పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
Read More: Priya Prakash Varrier: అందాల హంసలా మెరిసిన ప్రియా వారియర్, ట్రెండింగ్ లో ఫోటోలు
- ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటం, అతని పార్టీ ఒక కూటమిగా పోటీ చేయకుండా నిషేధించబడినందున, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అత్యధిక స్థానాలను గెలుచుకోవడానికి, దాని వ్యవస్థాపకుడు నవాజ్ షరీఫ్‌కు నాల్గవసారి ప్రధానమంత్రి పదవిని ఇవ్వడానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.
- PTI, PPP ల పట్ల ప్రజల్లో అంతగా ప్రచారం నిర్వహించట్లేదని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook