Aung San Suu Kyi: ఆంగ్​ సాన్​ సూకీకి నాలుగేళ్లు జైలు- కారణాలు ఇవే..

Aung San Suu Kyi: మయన్మార్​ మిలిటరీ పాలనలో.. ఆంగ్​ సాన్​ సూకీకి మరిన్ని చిక్కులు వచ్చి పడుతున్నాయి. అమెకు నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ మిలిటరీ జుంటా తీర్పు చెప్పింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 03:06 PM IST
  • ఆంగ్​ సాన్ సూకీకి నాలుగేళ్లు జైలు శిక్ష
  • శిక్ష ఖరారు చేసిన మయన్మార్​ మిలిటరీ జుంటా
  • ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నిర్భందంలోనే సూకీ
Aung San Suu Kyi: ఆంగ్​ సాన్​ సూకీకి నాలుగేళ్లు జైలు- కారణాలు ఇవే..

Myanmar’s Ousted Leader Aung San Suu Kyi Sentenced to Four Years in Prison: బహిష్కరణకు గురైన మయన్మార్​ నేత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్​ సాన్​ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అమెకుపై మోపిన వివిధ ఆరోపణలపై జరుగుతున్న విచారణల్లో ఇది మొదటిదని (Aung San Suu Kyi jailed) తెలుస్తోంది.

ఈ శిక్షను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

శిక్ష ఎందుకు?

సైనిక ప్రభుత్వం పట్ల అసమ్మతిని ప్రేరేపించడం, కొవిడ్​ నిబంధనలను (Corona rules) పాటించకపోవడం వంటి విషయాల్లో సూకీని దోషిగా తేల్చి ఈ శిక్షను ఖరారు చేసింది మిలిటరీ జుంటా.

అమెపై మొత్తం 11 అభియోగాలు నమోదవగా అవన్నీ తప్పుడు ఆరోపణలని.. వాటన్నింటిని ఆమె ఖండిచారు. ఈ అభియోగాలన్నింటితో ఆమెకు జీవిత ఖైదు విధించే దిశగా అడుగులు పడుతున్నాయి.

నిర్భందంలో సూకీ..

గత ఏడాది చివర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆంగ్​ సాన్​ సూకీ విజయం సాధించగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సైనిక తిరుగుబాటుదారులు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆంగ్ సాన్​ సూకీ సహా మయన్మార్ కీలక నేతలంతా నిర్భందంలో (Myanmar's ousted leader Aung San Suu Kyi) ఉన్న విషయం తెలిసిందే.

సైనిక తిరుగుబాటుపై పౌరుల్లో తీవ్ర వ్యతిరేక కూడా వచ్చింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో సైన్యం నిరసనలను అణచి వేసే చర్యలు చేపట్టింది.

ఇంటర్నెంట్ నిలిపివేయడం మొదలుకుని.. నిరసనకారులపై కాల్పులు జరపడం వింటి చర్యలకు దిగింది సైన్యం. ఈ కారణంగా వందలాంది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

మయన్మార్ సైనిక చర్యలపై అంతర్జాతీయంగా వ్యతిరేకత కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వివిధ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలపై దాడులను మానుకోవాలని హితవు పలికాయి.

దేశంలో ఇప్పటికీ నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. ప్రజలు స్వచ్ఛందంగానే నిరసనల్లో పాల్గొంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

Also read: Omicron Status: శరవేగంగా ఒమిక్రాన్ వేరియంట్, ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో

Also read: Indonesia Volcano Eruption: బద్దలైన అతిపెద్ద అగ్నిపర్వతం, నదిలా ప్రవహిస్తున్న లావా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News