Mosque blast in Quetta : మసీదులో పేలుడు.. 15 మంది మృతి!

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలోని క్వెట్టాలో ఉన్న ఓ మసీదులో శుక్రవారం సాయంత్రం పేలుడు చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా మొత్తం 15 మంది చనిపోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ప్రార్థనల సందర్భంగా పేలుడు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. 

Last Updated : Jan 11, 2020, 12:03 AM IST
Mosque blast in Quetta : మసీదులో పేలుడు.. 15 మంది మృతి!

బలూచిస్తాన్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలోని క్వెట్టాలో ఉన్న ఓ మసీదులో శుక్రవారం సాయంత్రం పేలుడు చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారి సహా మొత్తం 15 మంది చనిపోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ప్రార్థనల సందర్భంగా పేలుడు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన క్వెట్టాలోని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో చనిపోయిన పోలీసు అధికారిని డిఎస్పీ అమానుల్లగా గుర్తించినట్టు క్వెట్ట డీఐజి అబ్దుల్ రజాక్ తెలిపారు. 

(బాంబు దాడి ఘటన అనంతరం పేలుడు జరిగిన మసీదు వద్ద పహారాలో ఉన్న బలగాలు AFP photo) 

పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం చూస్తే.. దాడిలో చనిపోయిన పోలీస్ అధికారే ఈ పేలుడుకి పాల్పడిన వారి లక్ష్యం అయ్యుండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఓ లేకపోలేదు. గత నెలలో గుర్తుతెలియని దుండగులు ఇదే డీఎస్పీ కొడుకుని తుపాకీతో కాల్చిచంపారు. తాజాగా జరిగిన పేలుడులో డీఎస్పీ చనిపోయాడు. సరిగ్గా ఈ కోణమే అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ పోలీసు అధికారిని లక్ష్యంగా చేసుకునే దుండగులు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Trending News