Mali Mine Collapse: మాలీలో ఘోర విషాదం.. బంగారు గని కూలి 70 మంది దుర్మరణం..

Mali: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలీలో ఘోర దుర్ఘటన సంభవించింది. బంగారు గని కుప్పకూలిన ఘటనలో 70 మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2024, 12:41 PM IST
Mali Mine Collapse: మాలీలో ఘోర విషాదం.. బంగారు గని కూలి 70 మంది దుర్మరణం..

Gold Mine collapsed in Mali: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలీ (Mali)లో ఘోర ప్రమాదం సంభవించింది. బంగారు గని (Gold Mine) కుప్పకూలిన ఘటనలో సుమారు 70 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో గత శుక్రవారం జరిగినట్లు ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్ వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపింది. మైనింగ్‌ సమయంలో ఎలాంటి సేఫ్టీ ప్రకటించకపోవడం వల్ల ఈ దారుణం జరిగిందని పేర్కొంది. 

ఘటనా సమయంలో 200 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకూ 70 మృతదేహాలు బయటకు తీసినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువగా మైనర్లు ఉండటం విశేషం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

Also Read: Russia Military Jet: కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 65 మంది యుద్ధఖైదీల మృత్యువాత..

ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాల్లో మాలి కూడా ఒకటి. అయితే పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో ఇలాంటి ఘటనలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. అనధికారిక మైనింగ్ కు పాల్పడటం, సేప్టీ ఫ్రికాషన్స్ పాటించకపోవడం ఈ ప్రమాదాలకు కారణం.  

Also Read; ''వామ్మో.. ఇదేం చెండాలం''.. బాలుడితో ౩౦ సార్లు లైంగిక సంబంధం పెట్టుకున్న టీచర్.. ఎక్కడో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News