Mike Tyson: మైక్ టైసన్‌కి ఏమైంది.. హఠాత్తుగా ఎందుకిలా అయ్యాడు... షాక్ అవుతున్న ఫ్యాన్స్..

Mike Tyson in Wheel Chair: ఇటీవల తన స్నేహితుడు, థెరపిస్ట్ సీన్ మెక్‌ఫర్లాండ్‌తో మాట్లాడినప్పుడు మాత్రం టైసన్ తన ఆరోగ్యంపై పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేశారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 18, 2022, 09:04 AM IST
  • వీల్ చైర్‌లో మైక్ టైసన్
  • మైక్ టైసన్‌కి ఏమైంది
  • ఆయన అనారోగ్యంతో ఉన్నారా...!
Mike Tyson: మైక్ టైసన్‌కి ఏమైంది.. హఠాత్తుగా ఎందుకిలా అయ్యాడు... షాక్ అవుతున్న ఫ్యాన్స్..

Mike Tyson in Wheel Chair: బాక్సింగ్ యోధుడు మైక్ టైసన్ హఠాత్తుగా వీల్ చైర్‌లో కనిపించారు. ఇటీవల ఓ సందర్భంలో చావు సమీపిస్తోందని కామెంట్స్ చేసిన మైక్ టైసన్.. ఇప్పుడిలా వీల్ చైర్‌లో కనిపించడం చాలామందిని షాక్‌కి గురిచేసింది. టైసన్‌కి ఏమైందంటూ ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 56 ఏళ్ల టైసన్ అమెరికాలోని మియామి ఎయిర్‌పోర్టులో ఇలా వీల్ చైర్‌లో ప్రత్యక్షమయ్యారు. చేతిలో వాకింగ్ స్టిక్ కూడా పట్టుకోవడం గమనార్హం.

న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ 'సియాటికా' అనే సమస్యతో బాధపడుతున్నాడు. ఇది వెన్ను నొప్పికి సంబంధించిన సమస్య. కొద్దిరోజుల క్రితం న్యూయార్క్‌లోనూ టైసన్ వాకింగ్ స్టిక్‌ సాయంతో నడుస్తూ కనిపించాడు. 3 వారాల క్రితం ఓ సందర్భంలో టైసన్ మాట్లాడుతూ.. వాకింగ్ స్టిక్ కేవలం జాగ్రత్త కోసమేనని, తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పాడు. టైసన్ ఆరోగ్యం అంత సీరియస్‌గా ఏమీ లేదని ఆయన సన్నిహిత వర్గాలు కూడా వెల్లడించాయి.

ఇటీవల తన స్నేహితుడు, థెరపిస్ట్ సీన్ మెక్‌ఫర్లాండ్‌తో మాట్లాడినప్పుడు మాత్రం టైసన్ తన ఆరోగ్యంపై పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. 'ఏదో ఒకరోజు మనమంతా చనిపోతాం. అద్దంలో నా ముఖంపై చిన్న చిన్న మచ్చలు చూసుకున్నప్పుడు.. ఇక చివరి దశ సమీపించినట్లుగా అనిపిస్తోంది. నిజంగా త్వరలోనే అనిపిస్తోంది. చాలామంది ప్రముఖ వ్యక్తులు చివరి దశలో చాలా బాధ అనుభవిస్తూ ఈ లోకాన్ని వీడారు. నాకలా చనిపోవాలని లేదు.' అని మైక్ టైసన్ చెప్పుకొచ్చాడు. టైసన్‌లో ఉన్నట్టుండి ఈ వైరాగ్యానికి అనారోగ్య సమస్యలే కారణమా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.

మైక్ టైసన్ త్వరలోనే ఇండియన్ స్క్రీన్‌పై కనిపించనున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ-అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలో మైక్ టైసన్ కనిపించబోతున్నాడు. ఇండియన్ స్క్రీన్‌పై మైక్ టైసన్ కనిపించబోతుండటం ఇదే తొలిసారి. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కాబోతుంది. 

Also Read: Kabul Blast: ఆఫ్గనిస్తాన్‌లో భారీ పేలుడు.. రక్తసిక్తమైన మసీదు.. 20 మంది మృతి  

Also Read: Horoscope Today August 18th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు అనుకోని వివాదంలో చిక్కుకునే ప్రమాదం..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News