Boat capsizes: ఇంగ్లీష్ ఛానెల్​లో మునిగిన శరణార్థుల బోటు- 31 మంది మృతి!

Boat capsizes: ఫ్రాన్స్ నుంచి ఇంగ్లీష్ ఛానెల్ మీదుగా వెళ్తున్న ఓ ప్రయాణికుల బోటు నీట మునిగింది. ఈ ప్రమాదంలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 10:00 AM IST
  • ఇంగ్లీష్ ఛానెల్​లో పడవ ప్రమాదం
  • బోటు నీట మునిగి 31 మంది మృతి
  • ప్రయాణికులంతా వలసదారులుగా గుర్తింపు!
Boat capsizes: ఇంగ్లీష్ ఛానెల్​లో మునిగిన శరణార్థుల బోటు- 31 మంది మృతి!

Boat sank in the English Channel: యూరప్​లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఫ్రాన్స్ నుంచి ఇంగ్లీష్​ ఛానెల్​ మీదుగా వెళ్తున్న ఓ ప్రయాణికుల బోటు నీట మునగింది. ఈ దర్ఘటనలో మొత్తం 31 మంది ప్రాణాలు (Boat sank English Channel) కోల్పోయారు. ప్రమాద సమయంలో పడవలో 34 మంది ఉన్నట్లు తెలిసింది.

ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడగా.. మరో వ్యక్తి ఆచూకి ఇంకా తెలియరాలేదు. మృతులు ఏ దేశానికి చెందినవారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

శరణార్థులుగా అనుమానం..

పడవలో ప్రయాణిస్తున్నవారంతా శరణార్థులుగా అనుమానిస్తున్నారు (Migrant boat capsizes) అధికారులు. వారంతా ఫ్రాన్స్​ నుంచి బ్రిటన్ ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించారు.

పడవలో ఎక్కువ మంది అఫ్గానిస్థాన్​, సుడాన్​, ఇరాక్​, ఎరిత్రియా దేసాలకు చెందిన పౌరులు ఉన్నట్లు సమాచారం. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్లే.. అది మునిగిపోయు ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదంపై ఇటు ఫ్రాన్స్, అటు బ్రిటన్ ప్రభుత్వాలు విచారం వ్యక్తం చేశాయి.

Also read: పెగసస్ స్పైవేర్ చుట్టూ మరో వివాదం, ఎన్ఎస్ఓ గ్రూప్‌పై యాపిల్ కేసు

వలసలు ఎందుకు?

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న అఫ్గానిస్థాన్​ సహా నిత్యం సంక్షర్షణ భయాలున్న ఇరాక్​, సుడాన్ వంటి దేశాల పౌరులు.. మెరుగైన జీవనం, మంచి అవకాశాల కోసం.. ఇతర దేశాలను ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరంగా ప్రయాణాలు సాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇంగ్లీష్ ఛానెల్ మీదుగా అక్రమ రాకపోకలను అడ్డుకునేందుకు ఫ్రాన్స్, బ్రిటన్​లు సంయుక్తంగా పని చేయాలని గతంలో నిర్ణయించుకున్నాయి. అయితే ఈ విషయంపై ఇరు దేశాలు సరైన నిఘా పెడ్డటంలో లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి.

Also read: Imran Khan: 'దేశాన్ని నడిపించేంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు': ఇమ్రాన్ ఖాన్​

Also read: గడ్డకట్టిన మహా సముద్రం, ఇరుక్కుపోయిన 18 గూడ్స్ ఓడలు, ఎక్కడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News