Russia Banned: ఆ ప్రముఖ కంపెనీ సీఈవోకు ఇక రష్యాలో అనుమతి లేదు..!!

Russia Banned: ఉక్రెయిన్‌ కు అండగా నిలిచిన దేశాలపై రష్యా ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టింది. తమపైనే ఆంక్షలు విధిస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోతోంది. ఈ క్రమంలోనే మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తో పాటు, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌ ను తమ దేశంలోకి అనుమతించేదిలేదని రష్యా విదేశాంగ స్పష్టం చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2022, 07:32 PM IST
  • మెటా సీఈవోకు రష్యాలో అనుమతి నిరకరణ
  • రష్యా నిషేధిత జాబితాలో కమలా హ్యారిస్‌
  • ట్విట్టర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ పై నిషేధం
Russia Banned: ఆ ప్రముఖ కంపెనీ సీఈవోకు ఇక రష్యాలో అనుమతి లేదు..!!

Russia Banned: ఉక్రెయిన్‌ కు అండగా నిలిచిన దేశాలపై రష్యా ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టింది. తమపైనే ఆంక్షలు విధిస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోతోంది. ఈ క్రమంలోనే మెటా సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తో పాటు, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌ ను తమ దేశంలోకి అనుమతించేదిలేదని రష్యా విదేశాంగ స్పష్టం చేసింది. ఇప్పటికే ఫేస్‌ బుక్‌తో పాటు ఇన్‌స్ట్రాగ్రామ్‌ లాంటి సోషల్‌ మీడియా యాప్‌ లపై రష్యా నిషేధం విధించింది. 

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ప్రపంచ దేశాలు వ్యతిరేకించాయి. భారత్‌ మాత్రం తటస్థ వైఖరీని ప్రదర్శిస్తూ వస్తోంది. అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాలు మాత్రం రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ కు సపోర్ట్‌ గా నిలిచిన దేశాలపై రష్యా సైతం ప్రతీకారం తీర్చుకుంటోంది. తాజాగా ఫేస్‌ బుక్‌(మెటా) సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ను తమ దేశంలోని అనుమతించేది లేదని  రష్యా విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. జుకర్‌ బర్గ్‌ తో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కూడా ఈ నిషేధిత జాబితాలో ఉన్నారు. 

 ఇక లింక్డిన్‌ సీఈవో రియాన్‌ రోస్లాన్‌స్కై, రష్యాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న జర్నలిస్టులను కూడా తమ దేశంలోకి రానిచ్చేది లేదని విదేశాంగశాఖ ప్రకటించింది. అయితే ట్విట్టర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ మాత్రం ఈ నిషేధిత జాబితాలో లేరు. రష్యా  పోస్ట్‌ చేసిన అసత్యవార్తాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ తొలగిస్తూ వస్తోంది. అయినప్పటికీ ట్విట్టర్‌ సీఈవో పై ఎలాంటి నిషేధం విధించకపోవడం విచిత్రంగా కనిపిస్తోంది.

రష్యా ఇప్పటికే తమ దేశంలో ఫేస్‌ బుక్‌ తో పాటు ఇన్‌స్ట్రాగ్రామ్‌ ను కూడా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్ట్రాగ్రామ్‌తో పాటు ఫేస్‌ బుక్‌ యూజర్లు రష్యాలో అధికంగా ఉన్నారు. అయితే ఫేస్‌ బుక్‌ సంస్థకు చెందిన వాట్సప్‌ పై మాత్రం రష్యా ఎలాంటి నిషేధం విధించలేదు. ఎందుకంటే వాట్సప్‌ ను రష్యా కమ్యూనికేషన్‌ సోర్స్‌ గా ఉపయోగిస్తుంది. అందుకే వాట్సప్‌ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

గత వారం, రష్యా, ఉక్రెయిన్, జార్జియా మరియు పోలాండ్, తూర్పు యూరప్‌లోని మెటా యూజర్లు పుతిన్ మరణాన్ని కోరుతూ పోస్ట్‌లు పెట్టారు. ఇందుకు మెటా అనుమతించింది. అయితే మెటాతో పాటు ఇన్‌స్ట్రాగ్రామ్‌ పై నిషేధం విధించడంతో.. వెంటనే అలాంటి పోస్టులను తొలగించింది. ఆ సమయంలో రష్యాలో నిషేధానికి గురైన ఫోటో షేరింగ్‌ యాప్‌ కు.. 80 మిలియన్ల యూజర్లు ఉన్నట్టు బ్లూమ్‌బర్గ్‌ తన నివేదికలో తెలిపింది.

Also read: Jeevitha Rajashekar Cheating Case: అరెస్ట్‌పై స్పందించిన జీవితా రాజశేఖర్‌..ఏమన్నారంటే..!

Also read: KTR Comments‌: కేటీఆర్ సంచలన కామెంట్స్‌..ఎంఐఎంతోనే మాకు పోటీ.. బీజేపీకి సింగిల్ డిజిటే.!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News