Srilanka Earthquake: శ్రీలంక రాజధాని కొలంబో ఒక్కసారిగా వణికిపోయింది. శ్రీలంకలోని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూమి కంపించింది. భయంతో జనం ఇళ్లు, ఆఫీసులు, దుకాణాలు, షాపింగ్ మాల్స్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్థి, ప్రాణనష్టంపై ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
శ్రీలంక రాజధాని కొలంబోకు ఆగ్నేయంగా 1326 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. అదే సమయంలో ఇండియాలో లడ్డాఖ్‌లో 4.4 తీవ్రతతో భూమి కంపించింది. మద్యాహ్నం సమయంలో భూమి ఉన్నట్టుండి భారీగా కంపించడంతో ఇళ్లు, ఆఫీసులు, షాపుల్లో ఉన్న జనం భయంతో పరుగులు తీసి రోడ్లపైకి చేరుకున్నారు. భూకంపం తీవ్రతకు చాలా చోట్ల ఇళ్ల గోడలు బీటలు వారాయి. కొన్ని ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. చిన్న చిన్న బలహీనంగా ఉన్న ఇళ్లు కూలిపోయాయి. అయితే ఆస్థి, ప్రాణనష్టం వివరాలు ఇంకా అధికారికంగా తెలియలేదు. అమెరికా జియాలాజికల్ సర్వే అండ్ మైన్స్ బ్యూరో మాత్రం ఈ భూకంపం కారణంగా శ్రీలంకకు పెద్దగా నష్టం లేదని అంటోంది.
మరోవైపు మద్యాహ్నం 1.08 గంటలకు ఇండియాలోని లడ్డాఖ్‌లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత నమోదైంది. కార్గిల్‌కు వాయువ్య దిశలో 314 కిలోమీటర్ల దూరంలో, భూమికి 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. నిన్న సోమవారం తజకిస్థాన్‌లో 4.9 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే.
Also read: 800 Earthquakes: 14 గంటల్లో 800 భూకంపాలంటే నమ్మలేకున్నారా, ఎక్కడ , ఎప్పుడు జరిగింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook