Syria: సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ సిరియాలో అంతర్యుద్ధం మధ్య దేశం నుండి పారిపోయి రష్యాలో తలదాచుకున్నాడు. అయితే అస్సద్ దగ్గర ఎంత సంపద ఉందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. కిలోల కొద్దీ బంగారాన్ని తీసుకుని రష్యా వెళ్లినట్లు సమాచారం. అతని వద్ద 200 కేజీల బంగారం, లగ్జరీ కార్లు, పెద్ద మొత్తంలో డాలర్లు, యూరోలు ఉన్నట్లు సమాచారం. అష్రఫ్ ఘనీలాగే అల్-అస్సాద్ ఎంత డబ్బుతో పరారీ అయ్యాడో ఊహించలేమని స్థానిక మీడియా పేర్కొంది.
దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ కుటుంబం సిరియాలో అత్యంత ధనిక, శక్తివంతమైన కుటుంబం. 2023 నాటికి బషర్ అల్-అస్సాద్ కుటుంబం మొత్తం సంపద 200 టన్నుల బంగారం, లగ్జరీ కార్ల సేకరణ, 16 బిలియన్ డాలర్లు, 5 బిలియన్ యూరోలు అని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీస్ MI6ని ఉటంకిస్తూ సౌదీ వార్తాపత్రిక ఎలావ్ పేర్కొంది. ఈ మొత్తం సంపద సిరియా మొత్తం ఏడేళ్ల బడ్జెట్‌తో సమానమని పలు మీడియా నివేదికల్లో పేర్కొన్నారు.
సోషల్ మీడియా సైట్లలో వైరల్ అవుతున్న చిత్రాలలో, అధ్యక్షుడు అస్సాద్ విలాసవంతమైన కార్ల సేకరణను కలిగి ఉన్నారని చూడవచ్చు. ఇందులో స్పోర్ట్స్ కార్లు ఆఫ్-రోడ్ కార్లకు కన్వర్టిబుల్స్ ఉన్నాయి. సిరియాలోని స్థానిక మీడియా నివేదికల ప్రకారం, అల్-అస్సాద్ గ్యారేజీలో ఆడి, ఫెరారీ ఉన్నాయి. అతని వద్ద రోల్స్ రాయిస్ ఫాంటమ్, ఆస్టన్ మార్టిన్ DB7, ఫెరారీ F40, ఫెరారీ F430, Mercedes Benz SLS AMG, Audi R8 ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, డజనుకు పైగా మెర్సిడెస్ బెంజ్ కూపేలు, అనేక BMWలు, ఫెరారీ F40లు ఉన్నాయి. ఒక్క కారు ధర 3 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.
This is reportedly Bashar Assad's garage, where he kept his luxury cars while his people suffered in poverty. pic.twitter.com/E3dq40fzCN
— Clash Report (@clashreport) December 8, 2024
Also Read: Samantha Shocking Decision: విడాకుల తరువాత సమంత మరో షాకింగ్ నిర్ణయం..??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి