Kannada Canada Parliament: కెనడా పార్లమెంట్ లో కన్నడ భాషలో ప్రసంగం.. భారతీయుడు గర్వపడే విధంగా!

Kannada Canada Parliament: భారతదేశంలోని కర్ణాటకకు చెందిన చంద్ర ఆర్య ఇటీవలే కెనడాలోని పార్లమెంట్ లో ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కెనడియన్ పార్లమెంట్ లో ఆయన తన మాతృభాష తెలుగులో ప్రసంగించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 12:36 PM IST
Kannada Canada Parliament: కెనడా పార్లమెంట్ లో కన్నడ భాషలో ప్రసంగం.. భారతీయుడు గర్వపడే విధంగా!

Kannada Canada Parliament: భారతదేశానికి చెందిన చంద్ర ఆర్య ఇటీవలే కెనడియన్ పార్లమెంట్ లో ఎంపీగా ఎన్నికయ్యాడు. తాజాగా చంద్ర ఆర్య కెనడియన్ పార్లమెంట్ లో కన్నడలో ప్రసంగం చేశాడు. భారతదేశం వెలుపల తన మాతృభాష (కన్నడ)లో మాట్లాడాడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రపంచంలోని ఏ పార్లమెంట్‌లోనూ కన్నడ మాట్లాడటం ఇదే తొలిసారి అని చంద్ర ఆర్య పేర్కొన్నారు. 

కెనడియన్ ఎంపీ చంద్ర ఆర్య కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుమకూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందినవాడు. ఆర్య కెనడా దిగువ సభలోని ఒంటారియోలోని నేపియన్ ఎన్నికల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే చంద్ర ఆర్య కెనడియన్ పార్లమెంట్ లో ఈ విధంగా ప్రసంగించారు. 

"గౌరవనీయ స్పీకర్, కెనడా పార్లమెంట్‌లో నా మాతృభాషలో మాట్లాడే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా సిరా తాలూకాలోని ద్వారలు గ్రామానికి చెందిన వ్యక్తి ఎంపీగా ఎంపికై కన్నడలో మాట్లాడడం ఐదు కోట్ల మంది కన్నడిగులకు గర్వకారణం. కెనడాలోని కన్నడిగులు ఈ సభలో 2018లో కన్నడ రాజ్యోత్సవాన్ని జరుపుకున్నారు. నటసార్వభౌమ డాక్టర్ రాజ్‌కుమార్ పాడిన రాష్ట్రకవి కువెంపు కవితతో నా ప్రసంగాన్ని ముగిస్తాను. 'ఎల్లదరు ఇరు ఎంతదరు ఇరు ఎండిందిగు నీ కన్నడిగరు' (ఎక్కడ ఉన్నా, ఎంతటి వాడివైనా, నీవు కన్నడిగుడే) ధన్యవాదాలు స్పీకర్" అని చంద్ర ఆర్య ప్రసంగించారు. 

Also Read: Imran Khan: భారత్ పని తీరు భేష్‌..పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ప్రశంస..!

Also Read: China Corona: పుట్టినిల్లులో కోవిడ్ విజృంభణ..కీలక నగరాల్లో లాక్‌డౌన్‌ విధింపు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News