చంద్రుడిపై అడుగుపెట్టే తొలి ప్రవేట్ ప్రయాణీకుడు..

చంద్రుడిపై అడుగుపెట్టే తొలి ప్రవేట్ ప్రయాణీకుడు..

Last Updated : Sep 20, 2018, 04:46 PM IST
చంద్రుడిపై అడుగుపెట్టే తొలి ప్రవేట్ ప్రయాణీకుడు..

అంతరిక్ష ప్రయోగాల సంస్థ 'స్పేస్‌ఎక్స్' అంతరిక్షంలో ప్రయాణించే తన మొట్టమొదటి ప్రయాణీకుడి పేరును వెల్లడించింది. జపాన్‌ బిలియనీర్‌, ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ రిటైల్‌ వెబ్‌సైట్‌ జోజోటౌన్‌ స్థాపకుడు యుసకు మెజవా బిగ్‌ ఫాల్కన్‌ రాకెట్‌ (బీఎఫ్‌ఆర్‌)లో ప్రయాణిస్తూ చంద్రమండలంలో కాలుపెట్టే తొలి ప్రైవేట్‌ ప్రయాణీకుడు అని స్పేస్‌‌ఎక్స్‌ మంగళవారం వెల్లడించింది.

2023లో చంద్రుడిపైకి వెళ్లడానికి తనతో పాటుగా ఎనిమిది మంది ఆర్టిస్టులను మెజావా ఆహ్వానిస్తున్నారు. తోటి ఆర్టిస్టులతో కలిసి చంద్రమండలంలోకి వెళ్లాలనుకుంటున్నానని.. ట్విట్టర్‌లో వీడియోను షేర్‌ చేస్తూ పేర్కొన్నారు. వీరి అంతరిక్ష యాత్ర ఆరు రోజుల పాటు చంద్రమండలంలో 125 మైళ్లు సాగనుందని తెలిసింది.

ఇప్పటివరకు 24 మంది వ్యోమగాములు మాత్రమే చంద్రుడిని సందర్శించారు. ప్రవేట్ వ్యక్తులు ఎవరూ ఇప్పటివరకూ చంద్రుడిపైకి వెళ్లలేదు. చివరిసారిగా 1972లో అపోలో మిషన్‌ చంద్రమండలంపై యాత్ర చేపట్టింది.

 ఫోర్బ్స్ జాబితా ప్రకారం 42 ఏళ్ల యుసాకు మైజావా ఆస్తులు 2.9 బిలియన్ డాలర్లు. ఖరీదైన కళాఖండాలను సేకరించడం ఈయన హాబీనట. అయితే ఈ అంతరిక్ష యాత్ర కోసం యుసకు ఎంత సొమ్ము ఇచ్చాడన్నది మాత్రం స్పేస్‌ఎక్స్ సంస్థ వెల్లడించలేదు.

 

Trending News