333 తిమింగలాలను చంపిన జపాన్

జపాన్‌లో తిమింగలాల వేట వెనుక వ్యాపార కోణం ఉందా ? 

Last Updated : May 31, 2018, 07:24 PM IST
333 తిమింగలాలను చంపిన జపాన్

జపాన్ 333 తిమింగలాలను అధ్యయనం కోసం వేటాడి చంపినట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ (ఐడబ్ల్యూసీ) వెల్లడించిన తాజా నివేదికలో ఈ విషయం బట్టబయలైంది. జపాన్ వేటాడిన చంపిన 333 తిమింగలాలలో 122 తిమింగలాలు గర్భంతో వున్నట్టు ఈ నివేదిక స్పష్టంచేసింది. అందుకోసం జపాన్ రెండు జలాంతర్గాములు వినియోగించిందని, ఆ జలాంతర్గాముల్లో తిమింగలాలను వేటాడేందుకు అవసరమైన అత్యాధునిక యంత్రాలను వినియోగించినట్టు ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ నివేదిక పేర్కొంది. తిమింగలాలను వేటాడేందుకు జపాన్ వినియోగించిన బాణాలకు శక్తివంతమైన గ్రెనేడ్లు సైతం బిగించినట్టు ఐడబ్ల్యూసీ తెలిపింది. వాస్తవానికి మొత్తం 344 తిమింగలాలను వేటాడగా అందులో 11 మాత్రమే తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్నట్టు సమాచారం.

జపాన్‌లో తిమింగలాలను అధ్యయనం కోసం వేటాడినట్టు చెబుతున్నప్పటికీ దీని వెనుక పెద్ద కుట్ర లేకపోలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం తిమింగలాల మంసానికి సైతం మార్కెట్‌లో డిమాండ్ ఉండటమే. వాణిజ్య అవసరాల కోసం తిమింగలాలను వేటాడకూడదు అనే తీర్మానంపై సంతకం చేసిన జపాన్ స్వయంగా భారీ సంఖ్యలో తిమింగలాలను వేటాడటాన్ని జంతు, తిమింగలాల ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Trending News