International Women's Day 2023: సమాజంలో దేశ అభివృద్ధిలో పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా సహాయపడుతున్నారు. అయినప్పటికీ చాలా దేశాల్లో మగవారితో సమానమైన గౌరవం, అవకాశాలు స్త్రీలకు లభించడం లేదు. కొన్ని దేశాల్లో మహిళలు కటుంబం అనే నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్నారు. మహిళలను చాలా దేశాలు క్రీడా, రాజకీయాల, రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక రంగాలంలో ప్రోత్సహించడానికి సహాయ సహాకారాలు చేస్తున్నారు. ప్రతి రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, వారి హక్కుల గురించి మహిళలకు అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే మహిళ దినోత్సవానికి సంబంధించిన చరిత్ర, ప్రాముఖ్యత, 2023 సంవత్సరం నాటి థీమ్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1909 సంవత్సరం నుంచి మహిళ దినోత్సరం జరుపుకోవడం ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు.
మహిళా దినోత్సవ చరిత్ర:
అమెరికాలో 1908లో కార్మిక ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో దాదాపు 15,000 మంది మహిళలు పాల్గొన్నారు. వారంతా తమ హక్కులను డిమాండ్ చేస్తూ న్యూయార్క్ వీధుల్లోకి ఒక్క సారిగా వచ్చారు. పని గంటలు తగ్గించి వేతనాలు పెంచాలన్నది శ్రామిక మహిళల డిమాండ్. అంతే కాకుండా ఈ ఉద్యమంలో మహిళలకు ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్లు కూడా చేశారు. అంతేకాకుండా వారి నిమాండ్లు నెరవేరే దాకా ఉద్యమాన్ని ఆపలేదు. దీంతో అప్పటి ప్రభుత్వం వారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని పరిష్కారం దిశగా ఏర్పులు చేసింది. దీంతో 1909 లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది.
మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?:
మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక ప్రత్యేక ఉంది. అమెరికాలోని శ్రామిక మహిళలు తమ హక్కుల కోసం మార్చి 8న ఓ మార్చ్ చేపట్టారు. ఆ మార్చ్‌లో లక్షలాది మహిళలు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ ఉద్యమం వివిధ దేశాలకు దాకా పాకింది. ముఖ్యంగా దీని ప్రభావం రష్యాపై తీవ్రంగా పడింది. అక్కడ కూడా మహిళలు హక్కుల కోసం సమ్మె చేపట్టారు. అక్కడి మహిళలు వారి హాక్కుల కోసం ఉద్యమం చేయడంతో చక్రవర్తి నికోలస్ రాజీనామా ప్రకటించారు. దీంతో రష్యా మహిళలందరికీ ఓటు లభించింది. అప్పటి నుంచి మార్చి 8న మహిళా దినోత్సవ జరుపుకుంటున్నారు.
మహిళా దినోత్సవం 2023 థీమ్:
ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ 'ఎంబ్రేస్ ఈక్విటీ'.. అంటే లింగ సమానత్వంపై దృష్టి పెట్టండిని ఆర్థాన్ని ఇస్తుంది.
Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్
Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని
International Women's Day 2023: మహిళ దినోత్సవ ప్రాముఖ్యత, థీమ్, జరుపుకోవడానికి కారణాలు!