ఇండోనేషియా: 384కి చేరిన సునామీ మృతుల సంఖ్య

ఇండోనేషియా: 384కి చేరిన సునామీ మృతుల సంఖ్య

Last Updated : Oct 9, 2018, 10:08 PM IST
ఇండోనేషియా: 384కి చేరిన సునామీ మృతుల సంఖ్య

ఇండోనేషియాలో శుక్రవారం సంభ‌వించిన భూకంపంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 384కు చేరుకుంది. ఇండోనేషియాలోని సులవెసి ప్రాంతంలో వ‌చ్చిన భూకంపం వ‌ల్ల సునామీ భారీ విధ్వంసాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. శుక్రవారం మ‌ధ్యాహ్నాం 7.5 తీవ్రత‌తో భూకంపం సంభ‌వించింది. దీని ప్రభావం ఎక్కువగా పలు దీవి కనిపించింది. కాగా.. ఇప్పటివరకు 384 మంది మృత్యువాత పడినట్లు అక్కడి విపత్తు ఏజెన్సీ వెల్లడించింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పేర్కొంది.

ఈ సునామీ బీభత్సంతో అనేక మంది గాయపడగా.. వందలాది మంది గల్లంతయ్యారు. సముద్రపు అలలు సుమారు 6 మీటర్లు ఎగిసిపడినట్టు అక్కడి మీడియా తెలిపింది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్లు..  రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.  

ఇండోనేషియా: 384కి చేరిన సునామీ మృతుల సంఖ్య

పలు నగరంలో.. బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో అలలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. కొన్నిచోట్ల మృతదేహాలు నగర వీధుల్లోకి కొట్టుకువచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బీచ్ ఫెస్టివల్ కి వచ్చిన టూరిస్టుల సమాచారం కూడా లేనట్లు అధికారులు తెలిపారు.  సునామీ బీభత్సంతో పెద్దసంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి.

 

Trending News