Afghan Emergency Visa: ఆఫ్ఘన్‌లో ఇండియన్స్ కోసం ఎమర్జన్సీ వీసా జారీ

Afghan Emergency Visa: ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన తాజా పరిణామాల నేపధ్యంలో భారతదేశ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్ఘన్‌లో ఉన్న భారతీయుల కోసం సత్వర చర్యలు చేపట్టింది. అందుకే ఎమర్జన్సీ వీసాలు జారీ చేస్తోంది ఇండియా.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 17, 2021, 07:34 PM IST
Afghan Emergency Visa: ఆఫ్ఘన్‌లో ఇండియన్స్ కోసం ఎమర్జన్సీ వీసా జారీ

Afghan Emergency Visa: ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన తాజా పరిణామాల నేపధ్యంలో భారతదేశ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్ఘన్‌లో ఉన్న భారతీయుల కోసం సత్వర చర్యలు చేపట్టింది. అందుకే ఎమర్జన్సీ వీసాలు జారీ చేస్తోంది ఇండియా.

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యం(Talibans state) ఏర్పడింది. ఆప్ఘన్ సైన్యానికి తాలిబన్లకు గత కొద్దిరోజులుగా జరుగుతున్న యుద్ధంలో తాలిబన్లు పైచేయి సాధించారు. ఆఫ్ఘన్‌లో జరిగిన తాజా పరిణామాల నేపధ్యంలో అక్కడున్న భారతీయుల్ని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central government) అప్రమత్తమైంది. ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి రప్పించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఎమర్జన్సీ వీసాల జారీ చేస్తోంది. ఆఫ్ఘన్‌లో(Afghanistan)ఉన్న ప్రస్తుత పరిస్థితిని పరిగణలో తీసుకుని అక్కడున్న భారతీయులు ఇండియాకు వచ్చేలా ఈ వీసా సదుపాయం కల్పిస్తోంది వీసా దరఖాస్తుల్ని వేగంగా ట్రాక్ చేసే లక్ష్యంతో ఈ ఎమర్జెన్సీ ఎక్స్‌మిస్క్ వీసా (Emergency Visa)పేరుతో కొత్త కేటగరీ ఎలక్ట్రానిక్ వీసా ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రానికి వీసా(Electronic Visa) ఎలా తీసుకోవాలంటే..

ముందుగా indianvisaonline.gov.in/evisa/registration పై క్లిక్ చేయాలి. తరువాత Apply here for e-visaపై క్లిక్ చేసి నేషనాలిటీ ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత Passport Type, Port of Arrival, Date of Birth, Email Id, Expected date of arrival వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వీసా కేటగరీలో ఎమర్జెన్సీ ఎక్స్‌మిక్స్ వీసా ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తరువాత అక్కడ కన్పించే క్యాప్చా నమోదు చేసి రిఫరెన్స్ కోసం స్క్రీన్ షాట్ తీసుకుని Continueపై క్లిక్ చేయాలి. ప్రాధమిక వివరాల్ని పూర్తి చేసిన తరువాత పేజీలో దరఖాస్తుదారుల వివరాల కోసం ఉండే ఫారం పూర్తి చేయాలి. ఈ వీసాకు ఫీజు ఉండదు. ఆప్ఘనిస్తాన్ (Afghanistan)నుంచి వచ్చే భారతీయుల కోసం ఓ హెల్ప్‌లైన్ నెంబర్ 919717785379 జారీ చేశారు. 

Also read: Breaking News: General amnesty ప్రకటించిన ఆఫ్ఘన్ తాలిబన్లు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News