కలిసి పోరాడదాం.. విజయం సాధిద్దాం..!!

'కరోనా వైరస్'తో  పోరాడుతున్న అమెరికాకు చేదోడు వాదోడుగా నిలిచినందుకు భారత దేశానికి ధన్యవాదాలు.. అంటూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ట్వీట్ చేశారు. అంతే కాదు ప్రధాని నరేంద్ర  మోదీ ఒక గొప్ప నాయకుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

Last Updated : Apr 9, 2020, 10:50 AM IST
కలిసి పోరాడదాం.. విజయం సాధిద్దాం..!!

'కరోనా వైరస్'తో  పోరాడుతున్న అమెరికాకు చేదోడు వాదోడుగా నిలిచినందుకు భారత దేశానికి ధన్యవాదాలు.. అంటూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ట్వీట్ చేశారు. అంతే కాదు ప్రధాని నరేంద్ర  మోదీ ఒక గొప్ప నాయకుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. 

మోదీ బలమైన నాయకుడు.. మంచి దేశానికి నాయకత్వం వహిస్తున్నారు... అంటూ కితాబిచ్చారు. అంతే కాదు.. భారత దేశం కేవలం దేశం మాత్రమే కాదు.. ఓ గొప్ప మానవతా దేశం అంటూ ప్రశంసల జల్లు కురిపించారు ట్రంప్. హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం ఎగుమతిపై ఆంక్షలు ఎత్తివేసి .. ఎగుమతి చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. దీనిలో  భాగంగానే భారత దేశాన్ని పొగుడుతూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై  ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇలాంటి సమయంలోనే స్నేహితులను మరింత దగ్గర చేస్తుందని మోదీ ట్వీట్ చేశారు. భారత్, అమెరికా బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు. మానవతా దృక్పథం ఉన్న ఎవరి  కోసమైనా పని చేసేందుకు  భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు. 'కరోనా వైరస్'ను ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పోరాడదామని సూచించారు. అంతే కాకుండా కలిసి కట్టుగా పోరాడితే విజయం మనదేనని స్పష్టం చేశారు.

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News