ఆ భారతీయ మహిళ మరణం.. ఐర్లాండ్‌లో అబార్షన్ చట్టంపై ఉద్యమాన్నే లేవనెత్తింది

ఐర్లాండ్ లాంటి దేశంలో అబార్షన్ అంటే పాపంతో సమానం. మహిళలు అబార్షన్ చేయించుకోవడమంటే శిశువు జీవించే హక్కును హరించినట్లే. కానీ అదే అబార్షన్ చట్టం 2012లో ఆ దేశంలో ఓ భారతీయ మహిళ చావుకి కారణమైంది.

Last Updated : May 26, 2018, 07:18 PM IST
ఆ భారతీయ మహిళ మరణం.. ఐర్లాండ్‌లో అబార్షన్ చట్టంపై ఉద్యమాన్నే లేవనెత్తింది

ఐర్లాండ్ లాంటి దేశంలో అబార్షన్ అంటే పాపంతో సమానం. మహిళలు అబార్షన్ చేయించుకోవడమంటే శిశువు జీవించే హక్కును హరించినట్లే. కానీ అదే అబార్షన్ చట్టం 2012లో ఆ దేశంలో ఓ భారతీయ మహిళ చావుకి కారణమైంది. 2012లో సవితా హలప్పనవార్ అనే భారతీయ వైద్యురాలు 4 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు విపరీతమైన అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భస్రావం జరిగే సూచనలు కనిపిస్తున్నాయని... అదే జరిగితే సవిత ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తవచ్చని తెలిపారు.

వెంటనే తను కూడా వైద్యురాలు కనుక సవిత.. వైద్యులకు ఓ సలహా ఇచ్చింది. గర్భస్రావం జరగకముందే అబార్షన్ చేసి శిశువును తీసి తన ప్రాణాలు కాపాడమని వేడుకొంది. కానీ వైద్యులు ఆమె మాటలను లక్ష్యపెట్టలేదు. అబార్షన్ చేయడమనేది ఐర్లాండ్ చట్టాల ప్రకారం నేరమని తేల్చిచెప్పారు. కానీ సవిత ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణించడంతో ఓ ప్రత్యేక కేసుగా ఆమెను గుర్తించి వైద్యులు అబార్షన్ చేయడానికి సిద్ధపడ్డారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. వైద్యులు అబార్షన్ చేయకముందే సవితకు ప్రసవమైంది. కానీ బిడ్డ చనిపోయింది. ఆ తర్వాత సవిత కూడా మరణించింది. 

అయితే సవిత ఏ పరిస్థితిలో మరణించాల్సి వచ్చిందో మీడియా ద్వారా తెలుసుకొని ఐర్లాండ్‌లోని పలు మహిళా సంఘాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. అబార్షన్ చట్టాల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేశాయి. రోగి చనిపోతుందని తెలిసి కూడా అబార్షన్ చేయకపోవడం ఎలాంటి ధర్మమని వాదించాయి. "సవిత మరణం- అబార్షన్" అన్న అంశంపై భిన్నవాదనలు కూడా తెరమీదికి వచ్చాయి. ఈ క్రమంలో ఐర్లాండ్ రాజ్యాంగంలో 8వ సవరణలో మార్పులు చేయాలని.. తల్లి ప్రమాదపుటంచుల్లో ఉంటే.. అబార్షన్‌కు అనుమతించవచ్చన్న విధానానికి మొగ్గుచూపాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తూ ఓటింగ్‌కు శ్రీకారం చుట్టాయి. 

Trending News