Hindu Temple Attacked: పాకిస్తాన్ కరాచీలో హిందూ దేవాలయంపై దాడి, విగ్రహం ధ్వంసం

Hindu Temple Attacked: శత్రుదేశం పాకిస్తాన్‌లో మైనార్టీలకు, ప్రార్ధనా స్థలాలకు రక్షణ కరువైంది. ఇప్పటికే వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా కరాచీలోని ఓ హిందూ ఆలయాన్ని ఛాంధసవాదులు టార్గెట్ చేశారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 21, 2021, 02:44 PM IST
Hindu Temple Attacked: పాకిస్తాన్ కరాచీలో హిందూ దేవాలయంపై దాడి, విగ్రహం ధ్వంసం

Hindu Temple Attacked: శత్రుదేశం పాకిస్తాన్‌లో మైనార్టీలకు, ప్రార్ధనా స్థలాలకు రక్షణ కరువైంది. ఇప్పటికే వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా కరాచీలోని ఓ హిందూ ఆలయాన్ని ఛాంధసవాదులు టార్గెట్ చేశారు.

పాకిస్తాన్‌లో మరోసారి హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఇమ్రాన్ ఖాన్ కొత్త పాకిస్తాన్‌లో హిందూ ఆలయాల్ని లక్ష్యంగా చేసుకోవడం కొనసాగుతోంది. ఇక్కడ ఓ వ్యక్తి ఆలయంలో ప్రవేశించి..దేవీ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. గొడ్డలితో విగ్రహంపై దాడి చేశాడు. పాకిస్తాన్‌లోని వీన్‌గాస్ పత్రిక కధనం ప్రకారం గత 22 నెలల్లో ఇది 9వ దాడి.

కరాచీ(Karachi)నగరంలోని రాంచోర్ ప్రాంతంలో ఉన్న హిందూ దేవాలయంపై ఈ దాడి(Hindu Temple Attacked) జరిగింది. ఆలయంపై దాడి చేసిన ఆ వ్యక్తిని పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది. విద్వేషం కేసు నమోదు చేశారు. కరాచీ హిందూ దేవాలయంపై జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఆ దేశంలోని మైనార్టీలకు వ్యతిరేకంగా ఉగ్రవాదుల దాడికి పాకిస్తాన్ ప్రభుత్వం మద్దతిస్తోందని ఆరోపించింది. పాకిస్తాన్‌లో‌ని కరాచీలో మరో హిందూ దేవాలయాన్ని కొంతమంది అపవిత్రం చేశారని బీజేపీ చెబుతోంది. ఇంతకుముందు అంటే  అక్టోబర్ నెలలో పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలోని ఓ దేవాలయంపై కూడా దాడి జరిగింది. ఆలయంలోని నగదు, ఆభరణాల్ని కూడా దొంగిలించారు. గత కొన్నేళ్లలో పాకిస్తాన్‌లోని హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేస్తున్నారు. పాకిస్తాన్‌లోని(Pakistan)మైనార్టీలపై జరుగుతున్న దాడులు, ప్రార్ధనా స్థలాల ధ్వంసంపై ప్రపంచదేశాలు కూడా ఖండించాయి.

Also read: Netherland Lockdown: ఒమిక్రాన్ తీవ్రత, జనవరి 14 వరకూ లాక్‌డౌన్ విధించిన నెదర్లాండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News