Survey on Heart Patients: యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ హార్ట్ పేషెంట్స్‌పై నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. వివాహితులైన హార్ట్ పేషెంట్స్‌తో పోలిస్తే అవివాహితులైన హార్ట్ పేషెంట్స్‌లో ఆత్మవిశ్వాసం తక్కువని సర్వేలో వెల్లడైంది. అంతేకాదు, అవివాహితులైన హార్ట్ పేషెంట్స్ ఎక్కువ కాలం జీవించే అవకాశం తక్కువగా ఉంటుందని తేలింది.
తాజా సర్వే ప్రకారం... దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి సోషల్ సపోర్ట్ మేలు చేస్తుంది. వివాహితులతో పోలిస్తే అవివాహితులు చుట్టూ ఉన్న సమాజంతో అంతగా ఇంటరాక్ట్ కాలేరు. వివాహిత హార్ట్ పేషెంట్స్‌కు జీవిత భాగస్వామి నుంచి దొరికే మద్దతు, వారి ఆరోగ్యం పట్ల చూపే శ్రద్ధ ఆ పేషెంట్స్ ఎక్కువ కాలం జీవించడానికి దోహదపడుతాయి. వివాహిత హార్ట్ పేషెంట్స్‌తో పోలిస్తే అవివాహిత హార్ట్ పేషెంట్స్‌లో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది.
ఈ సర్వే కోసం 2004-2007 మధ్య హార్ట్ ఫెయిల్యూర్స్‌తో ఆసుపత్రిపాలైన 1022 మందిపై పరిశోధన జరిపారు. ఇందులో 1008 మంది తమ మ్యారిటల్ స్టేటస్‌ను వెల్లడించారు. వీరిలో 633 మంది వివాహితులు కాగా 375 మంది అవివాహితులు. ఈ అవివాహితుల్లో 96 మంది అసలే పెళ్లి చేసుకోనివారు కాగా.. 195 మంది జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరి జీవితం గడుపుతున్నవారు. మరో 84 మంది విడాకులు తీసుకున్నవారు. పదేళ్ల పరిశోధనలో వీరిలో 679 మంది మృతి చెందారు. వీరిలో అవివాహితులే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి హార్ట్ పేషెంట్స్‌కు సోషల్ సపోర్ట్ అవసరమని సర్వే బృందంలో ఒకరైన డా.ఫేబియస్ పేర్కొన్నారు.
Also Read: పట్టుమని పదేళ్లు లేవు.. తల్లిదండ్రులకే ఊహించని షాకిచ్చిన బుడతలు... ఈ అన్నాదమ్ములు మహా ముదుర్లు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook