China: చైనాలో సెగలు పుట్టిస్తోన్న హీట్ వేవ్..మేఘమథనం షూరు చేసిన ప్రభుత్వం..!

China: కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చైనాను మరో సమస్య వెంటాడునీ తెలివికి ఓ దండం సామి.. ప్రపంచంలోనే అతిపెద్ద కింగ్ కోబ్రాను ఎలా పట్టాడో చూడండి!తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా హీట్ వేవ్ కలకలం రేపుతోంది.

Written by - Alla Swamy | Last Updated : Aug 19, 2022, 03:15 PM IST
  • అగ్రరాజ్యం చైనాలో కరువు విలయతాండవం
  • ఎండిపోతున్న నదులు
  • దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం
China: చైనాలో సెగలు పుట్టిస్తోన్న హీట్ వేవ్..మేఘమథనం షూరు చేసిన ప్రభుత్వం..!

China: అగ్రరాజ్యం చైనాలో కరువు విలయతాండవం చేస్తోంది. దీంతో అక్కడివాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నదులు సైతం ఎండిపోతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలంతా విద్యుత్‌ను అధికంగా ఉపయోగిస్తున్నారు. హైడ్రోపవర్‌ ఉత్పత్తి సరిగా జరకపోవడంతో ఫ్యాక్టరీలు, వాణిజ్య సముదాయాలు మూతపడుతున్నాయి. కరెంట్ కోతలతో ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. 

పరిస్థితిని చక్కదిద్దేందుకు జిన్‌పింగ్ ప్రభుత్వం నడుంబిగించింది. కృత్రిమ వర్షాలు కురిపించేందుకు ఏర్పాట్లు చేసింది. కృత్రిమ వర్షాలు కురిసేలా మేఘాలను ప్రేరేపిస్తున్నారు. 1961 తర్వాత మళ్లీ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద నది యాంగ్జీలో నీటి మట్టం తగ్గుతోంది. గత రెండు నెలల నుంచి తీవ్రమైన ఎండలు పెడుతున్నాయి. దీంతో నదిలో నీరు ఇంకిపోతున్నాయి. 

మరోవైపు చైనాలో వర్షపాతం భారీగా తగ్గిపోయింది. నైరుతి చైనాలో కరువు ప్రభావం అధికంగా ఉంది. 51 నదులు, 24 రిజర్వాయర్లు పూర్తిగా ఎండిపోయాయి. చైనాలోని మూడో అతిపెద్ద ప్రావిన్స్‌ సిచువాన్‌లో హైడ్రోపవర్‌ వినియోగం అధికంగా ఉంది. ఐతే ఇటీవల వర్షాభావం కారణంగా హైడ్రోపవర్‌ ప్లాంట్ల ఉత్పత్తి పడిపోయింది. ఇటు చైనాలో బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. ఈకారణంగా కరెంట్ కోతలు ఏర్పడుతున్నాయి. 

డైజూలో కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయి. ప్రావిన్స్ రాజధాని చెంగ్డూలో స్టేషన్ల నిర్వహణలో భాగంగా వీధిలైట్లను విద్యుత్ నిలిపి వేశారు. ప్రావిన్స్‌లోని పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, ఆఫీసులకు కరెంట్‌ను అంకెల ఆధారంగా పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రముఖ తయారీ కంపెనీలను మూత పడే పరిస్థితి వచ్చాయి. మరి కొన్ని కర్మాగారాలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను పరిమితి మించి వాడుకూదని ఆదేశాలు జారీ చేశారు. 

చైనాలో అధిక ఉష్ణోగ్రత కారణంగా 138 నగరాల్లో రెడ్‌ అలర్ట్ జారీ చేశారు. మరో 373 నగరాల్లో ఆరెంజ్ అలర్ట్‌ ప్రకటించారు. గురువారం దేశవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హీట్ వేవ్ మొదలై 64 రోజులు దాటిపోయిందని అధికారులు తెలిపారు. దీంతో చైనా ప్రభుత్వం దిద్దబాటు చర్యలు చేపట్టింది. కరువును తట్టుకునేందుకు మేఘమథనం చేస్తోంది. చైనా విమానాలు సిగరెట్‌ సైజ్‌లోని సిల్వర్ అయోడైడ్ రాడ్లను మేఘాల్లోకి వదులుతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా 1940 నుంచి క్లౌడ్ సీడింగ్ నడుస్తోంది. ఇటీవల చైనాలో దీనిపై అధికంగా ఫోకస్ చేశారు. యాంగ్జీ పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల మేఘమథనం షురూ చేశారు. హుబే ప్రావిన్స్‌లో క్లౌడ్ సీడింగ్ ప్రారంభించారు. చాలా చోట్ల తీవ్రమైన తాగు నీటి సమస్య ఉంది. భారీ వర్షం కోసం చైనావాసులతా ఆశగా ఎదురు చూస్తున్నారు.

Also read:నీ తెలివికి ఓ దండం సామి.. ప్రపంచంలోనే అతిపెద్ద కింగ్ కోబ్రాను ఎలా పట్టాడో చూడండి!

Also read:CBI Raids: ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు..  మంచి పనులు బీజేపీ నచ్చవన్న కేజ్రీవాల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News