Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో మరో భారీ భూకంపం.. ఈ నెలలో మూడోది..

Afghanistan Eartquake: ఆప్ఘనిస్తాన్ లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతగా నమోదైంది. ఈ భూకంపం వల్లఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2023, 05:12 PM IST
Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో మరో భారీ భూకంపం.. ఈ నెలలో మూడోది..

Afghanistan Eartquake: వరుస భూకంపాలతో అఫ్గానిస్థాన్‌(Afghanistan) అల్లాడుతోంది. అక్టోబరు 07న సంభవించిన భూకంపం ధాటికి రెండు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అక్కడ భారీ భూకంపం సంభవించంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఇది పశ్చిమ అఫ్గానిస్థాన్‌లోని హెరాత్‌ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. ఉపరితలం నుంచి దాదాపు 8 కిలోమీటర్ల లోతుల్లో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపంలో ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించి ఎటువంటి వివరాలు తెలియరాలేదు. ఇది ఈ నెలలో మూడోది. ఇప్పటికే ఆ దేశం పేదరికంతో ఇబ్బందులు పడుతుంది. భూకంపాల వల్ల అక్కడి ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 

వారం రోజుల కిందట హెరాత్‌ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపానికి రెండు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 90 శాతం మంది పిల్లలు, మహిళలు ఉండటం విశేషం. ఆ దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఒకటిగా ఇది నిలిచింది.  ఈ భూకంప కేంద్రం ఉన్న జెండాజెన్‌ జిల్లాలో 1,200 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఈ నెల 11న మరోసారి భూకంపం సంభవించింది. ఇది కూడా భూకంప లేఖినిపై 6.3 తీవ్రతగా నమోదైంది. ఈ భూకంపం దెబ్బకు వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం కాగా.. పాఠశాలలు, ఆఫీసులు, హెల్త్ క్లీనిక్లు దెబ్బతిన్నాయి. ఎన్నో గ్రామాలు దెబ్బతిన్నాయి. గత ఏడాది జూన్‌లో పాక్టికా ప్రావిన్స్‌లో 5.9 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 1,000 మందికి పైగా మరణించగా.. పదివేల మంది నిరాశ్రయులైంది.

Also Read: Israel Palestine War Latest Updates: పసికందుల తలలు నరికి.. బాలికలపై అత్యాచారాలు.. దారుణాలను బయటపెట్టిన ఉగ్రవాది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News