హాలీవుడ్ నటిని కాల్చిచంపిన పోలీసులు

ప్రముఖ నటిని కాల్చిచంపిన పోలీసులు

Last Updated : Sep 2, 2018, 08:39 AM IST
హాలీవుడ్ నటిని కాల్చిచంపిన పోలీసులు

ప్రముఖ హాలీవుడ్ నటి వనెస్సా మార్క్‌వెజ్(49)ను పోలీసులు కాల్చిచంపారు. వనెస్సా ఇంటికి పోలీసులు వచ్చినప్పుడు ఆమె బొమ్మతుపాకీతో వారివైపు గురిపెట్టగా.. అది నిజమైన తుపాకీ అని భావించిన పోలీసులు.. ఆమెను కాల్చిచంపారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వనెస్సా ఆరోగ్యం బాగోలేదంటూ పోలీసులకు ఆమె ఇంటి యజమాని ఇటీవలే సమాచారం అందించాడు. దీంతో గురువారం ఆమె ఇంటికి పోలీసులు, వైద్యులు చేరుకున్నారు. వనెస్సా వారిని ఇంట్లోకి అనుమతించలేదు. సుమారు గంటన్నరకు పైగా మాటల వ్యవహారం చోటుచేసుకుంది. ఇకచేసేదేమిలేక పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. దీంతో భయపడిన వనెస్సా బొమ్మ తుపాకీ తీసుకుని పోలీసులపై గురిపెట్టింది. నిజమైన తుపాకీనే తమవైపు గురిపెట్టినట్లు భావించిన పోలీసులు.. ఆమెపై కాల్పులు జరిపారు.

కాల్పుల్లో గాయపడిన వనెస్సాను పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

వనెస్సా మార్క్‌వెజ్.. ప్రముఖ టెలివిజన్ సిరీస్ 'ఈఆర్' సహా సీన్ ఫెల్డ్, మెల్రోస్ ప్లేస్ తదితర షోలలో నటించారు. ‘ఫైర్ అండ్ ఐస్’, ‘స్టాండ్ అండ్ డెలివర్’, ‘ఫాదర్ హుడ్’, ‘ట్వంటీ బక్స్’, ‘అండర్ సస్పీషియన్’ వంటి పలు చిత్రాల్లో వెనెస్సా నటించింది.

Trending News