Rapper young dolph: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రముఖ ర్యాపర్ యంగ్ డాల్ఫ్(36)పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన టెన్నెస్సీలోని మెంఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయం(Memphis international airport) సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై మెంఫిస్ మేయర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యంగ్ డాల్ఫ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Also Read: ఐరాసలో పాకిస్తాన్ చెంప చెళ్లుమనిపించిన భారత ప్రతినిధి డాక్టర్ కాజల్ భట్ .. వీడియో
కేన్సర్‌తో బాధపడుతున్న తన బంధువురాలిని చూసేందుకు మెంఫిస్‌కు వచ్చాడు యంగ్ డాల్ఫ్(Rapper young dolph). ఆ సమయంలోనే ఓ గుర్తుతెలియని వ్యక్తి.. డాల్ఫ్‌పై కాల్పుల(Firing)కు తెగబడినట్లు అతని సోదరి మరేనో మయర్స్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యంగ్ డాల్ఫ్‌పై గతంలోనూ కాల్పులు జరిగాయి. 2008లో ర్యాపర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు యంగ్ డాల్ఫ్. పేపర్ రూట్ కాంపేన్, కింగ్ ఆఫ్ మెంఫిస్, రిచ్ స్లేవ్, తదితర ఆల్బమ్స్ తో ప్రజల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. గతేడాది అతడు రూపొందించిన రిచ్ స్లేవ్ ఆల్బమ్‌కు బిల్‌బోర్డ్ టాప్ 200 లిస్ట్‌లో స్థానం లభించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook