US Elections: ట్రంప్ వ్యాక్సిన్ ప్రచారాస్త్రంగా ఉపయోగపడుతుందా లేదా?

నవంబర్ 3 న అగ్రరాజ్యం ఎన్నికలు. కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేసేసింది. భారీగా కేసులు, మరణాలతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ సిద్ధం చేసి ప్రచారాస్త్రంగా మల్చుకోవాలనేది ట్రంప్ ఆలోచనగా ఉంది. ఇది సాధ్యమేనా మరి

Last Updated : Sep 16, 2020, 03:07 PM IST
  • నవంబర్ 3 అమెరికా ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ సాధ్యమా
  • అక్టోబర్ సర్ ప్రైజ్ విజయవంతమవుతుందా లేదా ట్రాజెడీగా మారనుందా
  • ప్రాణాలతో చెలగాటమంటున్న వైద్య నిపుణులు
US Elections:  ట్రంప్ వ్యాక్సిన్ ప్రచారాస్త్రంగా ఉపయోగపడుతుందా లేదా?

నవంబర్ 3 ( November 3 ) న అగ్రరాజ్యం ఎన్నికలు. కరోనా వైరస్ ( Coronavirus ) దేశాన్ని అతలాకుతలం చేసేసింది. భారీగా కేసులు, మరణాలతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ సిద్ధం చేసి ప్రచారాస్త్రంగా మల్చుకోవాలనేది ట్రంప్ ఆలోచనగా ఉంది. ఇది సాధ్యమేనా మరి

అమెరికా అధ్కక్షుడు డోనాల్ట్ ట్రంప్ ( Donald trump ) ఇటీవలి కాలంలో  తరచూ చెబుతున్న మాట అక్టోబర్ సర్ ప్రైజ్ ( October Surprise ). అక్టోబర్ లో అమెరికన్ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారనేది దీని సారాంశంగా తెలుస్తోంది. 70 లక్షల కేసులు, 2 లక్షలకు పైగా మరణాలతో దేశం మొత్తం కుదేలైంది. ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఎన్నికల వేళ కరోనా ప్రభావం కచ్చితంగా డోనాల్డ్ ట్రంప్ విజయావకాశాలపై పడనుంది. ఈ నేపధ్యంలో వ్యాక్సిన్ ( Corona vaccine ) ను సిద్ధం చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలనేది ట్రంప్ వ్యూహంగా ఉంది. ఆర్ధికంగా కూడా అమెరికా కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయింది. సగటు మనిషిని నిలువెల్లా ముంచేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ను ట్రంప్ కట్టడి చేయలేకపోయారన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఎన్నికల్లో వైరస్ ప్రభావం బలంగా ఉంటుందని అందుకే నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

ఒకవేళ అక్టోబర్ కాకపోయినా కనీసం నవంబర్ 3 అధ్యక్ష ఎన్నికలకు రెండ్రోజుల ముందైనా వ్యాక్సిన్ అందించవచ్చనే ధీమా ట్రంప్ లో ఉంది. ఇప్పటికే వాక్సిన్‌ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. తద్వారా కరోనా వైరస్ భయం లేకుండా చేశానని ప్రజలకు చెప్పుకవచ్చనేది ఆయన ఆలోచన. మరి ఇది సాధ్యమేనా..ఒకవేళ సాధ్యమైనా సరే ట్రంప్ వ్యాక్సిన్ ప్రచారాస్త్రం ( Trump Vaccine campaign ) ఎంతవరకూ ఓట్లు రాలుస్తుంది..హడావిడిగా అక్టోబర్ లోనే వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటమేనని వైద్యనిపుణులు ( Medical Experts ) హెచ్చరిస్తున్నారు. ఈ ప్రయత్నం వికటిస్తే..అక్టోబర్ సర్ ప్రైజ్ కాస్తా...అక్టోబర్ ట్రాజెడీగా మారవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పరిశోధనలు పూర్తికాకుండానే వ్యాక్సిన్ ఇవ్వడమనేది ప్రాణాలతో చెలగాటమాడటమేనని అంటున్నారు. Also read: Japan New PM: జపాన్ నూతన ప్రధానిగా యోషిహిడే సుగా ఎన్నిక

Trending News