Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయిన డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి కాల్పలు ఘటన చేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. యూఎస్ లోని సెక్యురిటీపై అనుమానాలు కలిగేలా చేస్తున్నాయి. ప్రపంచ అగ్ర రాజ్యాధినేతగా పనిచేసిన ఎక్స్ ప్రెసిడెంట్ పై ఒకిటి రెండు సార్లు ఈ ఘటన చోటు చేసుకోవడం అమెరికాల్లో రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. తాజాగా ఆదివారం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో గోల్ఫ్ క్లబ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా కాల్పులు జరిగాయి. దీంతో అప్రమత్తమైన యూఎస్ సీక్రెట్ సర్వీస్ పోలీసులు ట్రంప్‌ను వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. తుపాకీతో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన నిందితున్ని 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్‌గా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించారు. అతని నుంచి వివరాలు రాబట్టే పనిలో పడ్డారు.
ఆగంతకుడు డొనాల్డ్ ట్రంప్‌కు దాదాపు 275-450 మీటర్ల దూరం నుంచే ఈ కాల్పలు ఘటనకు పాల్పడ్డాడు. అయితే.. మరోసారి ట్రంప్ పై కాల్పుల ఘటన చోటు చేసుకోవడంపై అక్కడ భద్రతా వైఫల్యం మరోసారి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న ప్రదేశానికి దగ్గరగా పొదల్లో నుంచి అతను ఈ కాల్పలుకు పాల్పడ్డాడు. అతని దగ్గర ఏకే 47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు.
రెండు నెలల క్రితం, పెన్సిల్వేనియా రాష్ట్రం బట్లర్ నగరంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు ట్రంప్ పై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డారు. ఆ తర్వాత భద్రతా బలగాలు అతన్ని మట్టుపెట్టాయి. తాజాగా మరోసారి కాల్పుల ఘటన జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా పోటీ పడుతున్నారు. మొదటి సారి ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడైన ట్రంప్.. రెండోసారి.. తన సమీప డెమొక్రాట్ అభ్యర్ధి జో బైడన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇపుడు ముచ్చటగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. డొనాల్డ్ ట్రంప్ కు తన సమీప అభ్యర్ధఇ కమలా హారిస్ నుంచి గట్టి పోటీ ఎదురువుతోంది. రీసెంట్ గా జరిగిన అధ్యక్ష అభ్యర్ధుల ముఖాముఖిలో ట్రంప్ పై కమలా హారిస్ పై చేయి సాధించారు. తాజాగా ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటనను ఎక్స్ ఛీఫ్ ఎలన్ మస్క్ ఖండించారు. కేవలం ట్రంప్ పైనే ఎందుకు కాల్పులు జరుగుతున్నాయనేదే తన డౌటు అంటూ అనుమానాలు వ్యక్తం చేసాడు.
అమెరికాలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఎలక్షన్స్ జరగుతూ వస్తున్నాయి. అతి కూడా నాలుగేళ్లకు జరిగే లీఫ్ ఇయర్ నవంబర్ మొదటి మంగళవారం ఇక్కడ ఎలక్షన్స్ కండక్టర్ చేస్తారు. ఆ ఎన్నికల్లో గెలిచిన వారు.. జనవరిలో పదవీ బాధ్యతలు చేపడుతతారు. ఈ యేడాది నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుపున మరోసారి డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. మరోవైపు డెమాక్రాట్స్ తరుపున కమలా హారిస్ బరిలో ఉన్నారు.
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.