జెరూసలేంపై ట్రంప్ చారిత్రక ప్రకటన

ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తున్నామని, ఇక నుండి రికార్డులలో ఇజ్రాయిల్ రాజధానిగా టెల్ అవీవ్ బదులు జెరూసలేం అని నమోదు చేయాలని ఆయన అమెరికన్ ఎంబసీకి లేఖ రాశారు

Last Updated : Dec 7, 2017, 05:13 PM IST
జెరూసలేంపై ట్రంప్ చారిత్రక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఒక చారిత్రాత్మక వార్తగా నిలిచిపోనుంది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇప్పటికే ఆ ప్రకటన వల్ల చిచ్చు రగులుతోంది. ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తున్నామని, ఇక నుండి రికార్డులలో ఇజ్రాయిల్ రాజధానిగా టెల్ అవీవ్ బదులు జెరూసలేం అని నమోదు చేయాలని ఆయన అమెరికన్ ఎంబసీకి లేఖ రాశారు. అలాగే ట్విట్టర్‌లో కూడా ట్రంప్ ప్రకటనను లైవ్ చేశారు.

ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య ఉండే సమస్యలు ఒక కొలిక్కి వచ్చేందుకు మరియు ఆయా ప్రాంతాల్లో శాంతిని పెంపొందించేందుకే.. తాము జెరూసలేంను రాజధానిగా గుర్తిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అభినందించారు. గత అనేక సంవత్సరాలుగా ఉన్న ఈ వివాదానికి ఆఖరికి ట్రంప్ వల్ల సమాధానం దొరికిందని ఆయన చెప్పారు.

అయితే ట్రంప్ నిర్ణయాన్ని ఇప్పటికే పలు ఇస్లామిక్ దేశాలు వ్యతిరేకించాయి. ఇజ్రాయిల్, పాలస్తీనాలు గత కొంత కాలంగా జెరూసలేంను తమ రాజధానిగా భావిస్తూ.. పరస్పరం కలహించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ట్రంప్ తీసుకొన్న ఈ నిర్ణయం ఇరు దేశాల్లో స్నేహాన్ని పెంచాల్సింది పోయి.. మరింత దూరాన్ని పెంచేందుకు ఆజ్యం పోసే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

Trending News