రఫెల్ డీల్‌పై క్లారిటీ ఇచ్చిన డస్సాల్ట్ ఏవియేషన్

రఫెల్ డీల్‌పై క్లారిటీ ఇచ్చిన డస్సాల్ట్ ఏవియేషన్

Last Updated : Sep 22, 2018, 11:43 AM IST
రఫెల్ డీల్‌పై క్లారిటీ ఇచ్చిన డస్సాల్ట్ ఏవియేషన్

రఫెల్ ఒప్పందంలో భాగస్వామిగా రిలయన్స్ కంపెనీని ప్రతిపాదించింది భారత ప్రభుత్వమే అని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే పేర్కొనడాన్ని ఫ్రెంచ్ ప్రభుత్వం ఖండించింది.  ఆ వివాదంతో తమకు సంబంధం లేదని ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించింది. 'రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఆ ఇద్దరి మధ్య 58 వేల కోట్ల ఒప్పందం కుదిరింది. భారత కంపెనీ ఎంపిక విషయంలో తమ ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు' అని ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించింది. ఒప్పందాల్లో భాగస్వామిగా భారత సంస్థలను ఎనుకునే పూర్తి స్వేచ్ఛ ఫ్రెంచ్ కంపెనీలకు ఉంటుందని స్పష్టం చేసింది.

అటు రిలయన్స్ ను భాగస్వామిగా ఎంచుకోవడం తమ నిర్ణయమేమని డస్సాల్ట్ ఏవియేషన్ తెలిపింది.  మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రిలయన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డసాల్ట్ ఏవియేషన్ పేర్కొంది. డసాల్ట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే రాఫెల్ యుద్ధ విమానాల తయారీ కోసం నాగపూర్‌లో రిలయన్స్ సహకారంతో ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ఫాల్కన్‌తో పాటు రాఫెల్ విమానాల కోసం విడి భాగాలను తయారు చేయనున్నారు.

అంతకు ముందు.. రాఫెల్ ఒప్పందంలో అనిల్ అంబానీకి చెందిన డిఫెన్స్ ఇండస్ట్రీస్‌ని భాగస్వామిగా డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీ ఎంపిక చేసుకోలేదని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే అన్నారు. ఫ్రెంచి మీడియాతో హోలాండ్‌ మాట్లాడుతూ ‘ఈ వ్యవహారంలో మా ప్రమేయం ఏమీ లేదు. భారత ప్రభుత్వమే ఆ గ్రూపు పేరును ప్రతిపాదించింది. ఆ మేరకు అనిల్‌ అంబానీ గ్రూపుతో డస్సాల్ట్ సంప్రదింపులు జరిపింది. ఎంచుకోవడానికి మాకు మరో కంపెనీ కూడా లేదు. భారత్ నిర్ణయించిన పార్ట్‌నర్‌నే మేం అంగీకరించి చర్చలు ప్రారంభించాం’ అని తెలిపారు.

అయితే రాఫెల్ కోనుగోలు భారీ అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తొ్ంది.

Trending News