Danger bells in Brazil: కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదు. తస్మాత్ జాగ్రత్త. నిన్నటి వరకూ మూడోస్థానంలో ఉన్న బ్రెజిల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచాన్ని భయపెడుతోంది.
కరోనా వైరస్ ( Coronavirus ) మహమ్మారికి ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ( Vaccination ) ప్రారంభమవుతోంది. వైరస్ కేసులు తగ్గుతున్న దశలో బ్రిటన్ నుంచి ప్రారంభమైన కొత్త రకం కరోనా వైరస్ ( New coronavirus strain ) ఆందోళనకు గురి చేసింది. సరిగ్గా అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇటు ఇండియాలో కూడా కరోనా వైరస్ తగ్గుతోందని ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. సరిగ్గా ఇదే సమయంలో ఇప్పుడు బ్రెజిల్ దేశం నుంచి భయపెట్టే విషయం వెలుగుచూసింది.
బ్రెజిల్ ( Brazil )దేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. మొదట్లో 2వ స్థానంలో ఉన్న బ్రెజిల్..తరువాత మూడో స్థానంలో నిలిచింది. రెండవ స్థానాన్ని ఇండియా ఆక్రమించింది. మూడు నెలల్నించి తగ్గిన కేసులిప్పుడు పెరుగుతున్నాయి. ఏం జరిగిందో..ఎందుకు జరిగిందో తెలియదు. ఒక్కసారిగా రోజుకు 50 వేల కేసులు నమోదవుతున్నాయి. రెండ్రోజుల క్రితం 57 వేల 548 కొత్త కేసులు నమోదు కాగా..మొన్న 51 వేల 319 కేసులు వెలుగు చూశాయి. మళ్లీ నిన్న 48 వేల కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజులో 4 లక్షల 17 వేల కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో బ్రెజిల్లో 50 వేల కేసులు వెలుగుచూడటంతో కరోనా మరోసారి సంక్రమిస్తుందా అనే భయం నెలకొంది.
Also read: H1B Visa: హెచ్1బీ వీసాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook