'మాస్క్' వాడితే రిస్కేనా..?

'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. అగ్ర దేశాలతోపాటు చిన్న చిన్న దేశాల్లోనూ ప్రజలు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. 'కరోనా వైరస్' బారి నుంచి తప్పించుకునేందుకు అన్ని రకాల  నిబంధనలు పాటిస్తున్నారు.

Last Updated : Apr 7, 2020, 09:39 AM IST
'మాస్క్' వాడితే రిస్కేనా..?

'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. అగ్ర దేశాలతోపాటు చిన్న చిన్న దేశాల్లోనూ ప్రజలు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. 'కరోనా వైరస్' బారి నుంచి తప్పించుకునేందుకు అన్ని రకాల  నిబంధనలు పాటిస్తున్నారు.

అన్ని దేశాల్లోనూ ప్రజలు ముఖాలకు మాస్కులు ధరిస్తూ ..  'కరోనా వైరస్' బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫేస్ మాస్కులకు గిరాకీ భాగా పెరిగింది. ఐతే డిమాండ్ కు తగినట్లుగా సరఫరా కనిపించని పరిస్థితి ఉంది. మరోవైపు ఫేస్ మాస్కులకు సంబంధించి పరిశోధకులు చేసిన ఓ అధ్యయనం భయంకరమైన నిజాన్ని వెల్లడించింది. 

'కరోనా వైరస్' ఫేస్ మాస్కులపై  7 రోజుల  వరకు జీవించే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. హాంగ్ కాంగ్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. అంతే కాదు కరెన్సీ నోట్ల మీద, స్టీల్ పాత్రల మీద, ప్లాస్టిక్ వస్తువుల మీద కొద్ది  రోజుల వరకు 'కరోనా వైరస్' జీవించే ఉంటుందనే విషయాలు తమ అధ్యయనంలో తేలిందన్నారు. ఆయా వస్తువులపై బ్లీచింగ్ పౌడర్ చల్లడం వల్ల వైరస్ నశించిపోతుందని తెలిపారు.  ప్రతి ఒక్కరూ  సబ్బు నీటితో శుభ్రంగా చేతులు కడుక్కుంటే సరిపోతుందని వెల్లడించారు. లాన్సెట్ జర్నల్ లో ఈ అంశాలను యూనివర్శిటీ పరిశోధకులు ప్రచురించారు. 

అంతే కాదు కరోనా వైరస్ టిష్యూ పేపర్లపైనా కొద్ది గంటలు జీవించే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అంటే మూడు గంటల వరకు మాత్రమే బతికి ఉంటుందని తెలిపారు. మరోవైపు బట్టలు, కలప వస్తువులపై ఇది రెండు రోజుల వరకు జీవించి ఉంటుందని వెల్లడించారు.

తారల 'ఫ్యామిలీ' వీడియో ఇదిగో...!! 

ఐతే సర్జికల్ మాస్కులపై 7 రోజుల వరకు జీవించే ఉంటుందని చెప్పడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుబులు రేకెత్తుతోంది. కరోనా వైరస్ బారిన పడకుండా మాస్కులు ధరించాలనుకుంటే.. ఆ మాస్కులే ఇప్పుడు వైరస్ ను తీసుకొచ్చిపెడుతున్నాయనే భయాందోళన నెలకొంది..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News