China Covid-19 cases: చైనాలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులగా తగ్గిన కొవిడ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో వైరస్ ను కట్టడి చేసేందుకు అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్సులో (Shanxi province) ఉన్న ఫెన్‌యాంగ్ సిటీలో తాజాగా లాక్‌డౌన్ విధించారు. ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఉన్న రాజధాని హోహాట్‌లోను ఆంక్షలను అమలు చేస్తున్నారు. మంగళవారం నుండి బయట వాహనాలను నగరంలోకి ప్రవేశించనీయడం లేదు. గత 12 రోజుల్లో ఆ నగరంలో సుమారు 2వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు.
డ్రాగన్ కంట్రీలో అక్టోబరు మెుదటి వారంలో జాతీయ సెలవు దినాల్లో ప్రజలు విచ్చిలవిడిగా బయట తిరిగేశారు. దీంతో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కొన్ని పట్టణాల్లో సోమవారం నుంచే లాక్‌డౌన్లు విధించినట్లు తెలుస్తోంది. వచ్చే వారం నుండి బీజింగ్ లో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగానే లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు సమాచారం. కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు ముందు కరోనా కేసులు పెరగడం అక్కడి వారిని కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటికే కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీని అమలు చేస్తుంది. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత ఆంక్షలు సడలించే అవకాశం ఉంది.
Also Read: Nobel Prize Economics 2022: బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై పరిశోధనలకు ఆర్థిక నోబెల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook