26/11 దాడుల కుట్రదారుడిని తప్పించే ప్రయత్నం జరుగుతోందా..?

26/11 ముంబయి దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన కుట్రదారుడు హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ తప్పించే కుట్ర చేస్తోందని ప్రముఖ వార్తా పత్రికలు వెల్లడించడం గమనార్హం. 

Last Updated : May 24, 2018, 06:04 PM IST
26/11 దాడుల కుట్రదారుడిని తప్పించే ప్రయత్నం జరుగుతోందా..?

26/11 ముంబయి దాడుల్లో ప్రధాన పాత్ర పోషించిన కుట్రదారుడు హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ తప్పించే కుట్ర చేస్తోందని ప్రముఖ వార్తా పత్రికలు వెల్లడించడం గమనార్హం. హఫీజ్ సయీద్‌ను ఏదైనా పశ్చిమాసియా దేశానికి పంపించాలని ఈ క్రమంలో చైనా, పాకిస్తాన్‌కి తెలిపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

గత నెల చైనాలో జరిగిన బీఓఏఓ సదస్సులో భాగంగా  చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, పాకిస్తాన్ ప్రధాని షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీ కొద్ది నిముషాలు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో  హఫీజ్ సయీద్‌‌కు సంబంధించిన అంశం చర్చకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ముంబయి దాడులు జరిగాక ఐక్యరాజ్యసమితి హఫీజ్‌ సయీద్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా గుర్తించింది.

భారత్‌తో పాటు అమెరికా కూడా హఫీజ్‌ సయీద్‌ ఆచూకీ తెలిపే వారికి 10 బిలయన్ డాలర్లను బహుమతిగా ప్రకటించనున్నట్లు తెలిపాయి. మే 5వ తేదిన తనకు ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకున్నందుకు గాను హఫీజ్‌ సయీద్‌ లాహోర్ హైకోర్టులో పిటీషన్ వేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి కూడా ప్రభుత్వం సెక్యూరిటీని తొలిగించినందుకు ఆయన అభ్యంతరం తెలిపారు. 

Trending News