Hydrogen Train Photos: చైనాలో హైడ్రోజన్ ట్రెయిన్.. 600 కి.మీ ఆగే పని లేదు

Hydrogen Train Photos:  ప్రపంచంలో అయితే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్‌ని లాంచ్ చేసిన ఘనతను జర్మనీ సొంతం చేసుకుంది. ఆసియాలో ఆ ఘనత తమకే సొంతం కావాలన్న ఉద్దేశంతో కొత్తగా చైనా ఈ సెమీ హై స్పీడ్ హైడ్రోజన్ ట్రైన్‌ని లాంచ్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2023, 06:15 PM IST
Hydrogen Train Photos: చైనాలో హైడ్రోజన్ ట్రెయిన్.. 600 కి.మీ ఆగే పని లేదు

Hydrogen Train Photos: టెక్నాలజీలో, కొత్త సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ప్రపంచ దేశాల కంటే ఎప్పుడూ ముందే ఉండాలని తెగ ఉబలాటపడే చైనా తాజాగా హైడ్రోజన్ ట్రైన్‌ను ప్రవేశపెట్టింది. కొత్తగా లాంచ్ చేసిన ఈ హైడ్రోజన్ ట్రెయిన్ సెమీ హై స్పీడ్ కేటగిరీకి చెందిన రైలుగా చైనా ప్రకటించింది. ఆసియాలో మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైయిన్ ఇదే కావడం గమనార్హం. ప్రపంచంలో అయితే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్‌ని లాంచ్ చేసిన ఘనతను జర్మనీ సొంతం చేసుకుంది. ఆసియాలో ఆ ఘనత తమకే సొంతం కావాలన్న ఉద్దేశంతో కొత్తగా చైనా ఈ సెమీ హై స్పీడ్ హైడ్రోజన్ ట్రైన్‌ని లాంచ్ చేసింది. 

China-launches-semi-high-speed-hydrogen-train-with-600-km-range-china-hydrogen-train-speed-and-photos-2.jpg

చైనాలోని అర్బన్ రైల్వే విభాగం కోసం చైనాకు చెందిన చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ లిమిటెడ్ (CRRC) ఈ హైడ్రోజన్ ట్రెయిన్స్‌ని రూపొందించింది. ఇందులో నాలుగు బోగీలు ఉంటాయి. 

China-launches-semi-high-speed-hydrogen-train-with-600-km-range-china-hydrogen-train-speed-and-photos-3.jpg
గంటకు 160 కిమీ వేగంతో నడిచే ఈ సెమీ హై స్పీడ్ హైడ్రోజన్ ట్రైన్ లో ఒక్కసారి హైడ్రోజన్ ఇంధనం నింపితే.. 600 కిమీ ఆగకుండా పరిగెత్తగలదు. అది హైడ్రోజన్ రైలు రేంజ్ సామర్ధ్యం.

China-launches-semi-high-speed-hydrogen-train-with-600-km-range-china-hydrogen-train-speed-and-photos-3.jpg

చైనా కోసం చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ లిమిటెడ్ గతంలోనూ పలు సరికొత్త ఆవిష్కరణలు చేసింది. ఈ సెమీ హై స్పీడ్ హైడ్రోజన్ ట్రెయిన్ ప్రాజెక్ట్ కోసం చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ లిమిటెడ్ సరికొత్త డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించినట్టు తెలుస్తోంది.

China launches semi high-speed hydrogen train with 600 km range, chinas hydrogen train photos

ప్రస్తుతం ఉపయోగిస్తున్న డిజీల్ ఇంజిన్స్‌తో పోల్చుకుంటే ఈ హైడ్రోజన్ ట్రెయిన్స్ వల్ల కార్బన్ డయాక్సైడ్ వాయువు వ్యర్థాలు ఏడాదికి 10 టన్స్ తగ్గిపోతాయని చైనా భావిస్తోంది.

Trending News