డొక్లాంకు అతి చేరువలో చైనా యుద్ధ విమానాలు మోహరించాక.. భారత్ తీసుకుంటున్న చర్యలపై అగ్ర రాజ్యం భేష్ అంటూ కితాబిచ్చింది. భారత్-చైనా-టిబెట్ సరిహద్దు ప్రాంతం డొక్లాంలో చైనా రన్ వే నిర్మించి 40 యుద్ధ విమానాలను అక్కడకు పంపింది. అయితే చైనాకు చెక్ పెట్టేలా భారత్ పశ్చిమబెంగాల్ లోని హసీమార్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను భారీగా అభివృద్ధి చేసింది. భారత్ దాదాపు 30 సుఖోయ్ యుద్ధ విమానాలను అక్కడకు పంపింది. వాటితో పాటు బహ్మోస్ క్షిపణులను కూడా భారత్ అక్కడకు పంపింది. దీంతో చైనా వెనక్కు తగ్గింది. డొక్లాంలో మోహరించిన తమ యుద్ధ విమానాలను వెనక్కు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది.
ఈ మొత్తం వ్యవహారాన్ని శాటిలైట్ల ద్వారా పరిశీలిస్తున్న అమెరికా.. చైనా దూకుడుగా ముందుకెళ్ళినా.. భారత్ మాత్రం సంయమనంతో వ్యవహరించిందని కితాబిచ్చింది. భారత్ తీసుకున్న చర్యలపై అమెరికా అభినందనలు తెలిపింది.