China Fire Accidents Today: చైనాలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 32 కి చేరింది. మంగళవారం చైనాలోని ఓ ఆస్పత్రి భవనంలో సోమవారం మరో ఫ్యాక్టరీలో వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. చైనా అధికారిక మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12.57 గంటలకు ఫెంగ్టాయి జిల్లాలో ఒక హాస్పిటల్‌లోని అడ్మిషన్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవిందించి. ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 21 మంది చనిపోయారు. మధ్యాహ్నం 1.33 గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకురాగా.. మధ్యాహ్నం తరువాత 3.30 గంటల వరకు సహాయ కార్యక్రమాలు కొనసాగాయి.
ఆస్పత్రి మంటల్లో చిక్కుకోవడంతో అందులో ఉన్న 71 మంది రోగులను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చి అందులో అత్యవసర వైద్యం అవసరమైన పేషెంట్స్ ని ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలో మంటలు అంటుకోవడం వెనుక అసలు కారణం ఏంటనేది ఇప్పటివరకు అంతుచిక్కలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు ఓ కొలిక్కి వస్తే కానీ ఈ అగ్ని ప్రమాదానికి అసలు కారణం ఏంటో తెలిసే అవకాశం లేదు.
ఇదిలావుంటే, చైనాకి చెందిన జెజియాంగ్ ప్రావిన్సులోని జిన్హువా నగగం ఉయి కౌంటిలో ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం మధ్యాహ్నం 2.04 గంటలకు ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్స్ జరిగాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చాకా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో మొత్తం 11 మంది శవాలు లభ్యమయ్యాయి. చెక్క తలుపులు తయారయ్యే ఫ్యాక్టరీ కావడంతో కలప, పెయింట్స్ భారీ మొత్తంలో నిల్వ చేసి ఉండటం మంటలు త్వరగా ఫ్యాక్టరీ మొత్తానికి వ్యాపించేందుకు కారణమైంది. " ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసుకున్న చైనీస్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు " అని చైనా అధికారిక మీడియా పేర్కొంది.