బీజింగ్: ప్రపంచ వ్యాప్తంగా 27 దేశాలకు కరోనా వైరస్ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం ఇటీవల గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా ప్రాణాంతక వైరస్ కరోనా (COVID-19) కారణంగా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చైనాలో ఇప్పటివరకూ 1765 మంది మరణించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. పాజిటీవ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వాస్తవ మరణాల సంఖ్య ఇంతకు మరిన్ని రెట్లు అధికంగా ఉందని, లక్షల్లో కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: కరోనా వైరస్‌ను గుర్తించే యాప్ వచ్చేసింది
కరోనా వైరస్ (కోవిడ్-19) సోకినట్లు అనుమానాలుంటే బహిరంగ ప్రదేశాల్లో తిరకూడదని చైనా ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. అలాంటి వ్యక్తులు బహరింగ ప్రదేశాలలో తిరగకుండ అధికారులకు సమాచారం అందిస్తే.. వారే స్వయంగా పేషెంట్ ఇంటికి వచ్చి అంబులెన్స్‌లో తీసుకెళ్లి ప్రత్యేక చికిత్స అందిస్తామని సూచిస్తున్నారు. మరోవైపు కరోనా నుంచి కొంతమేర జాగ్రత్తగా ఉండేందుకు క్లోజ్ కాంటాక్ట్ డిక్టేటర్ (#CloseContactDetectorAPP) అనే యాప్‌ను చైనా డెవలప్ చేసింది. దీని ద్వారా సమీపంలోని వ్యక్తులకు కరోనా లక్షణాలుంటే యాప్ గుర్తించి హెచ్చరిస్తుంది.
Also Read: కరోనా వైరస్‌కు కొత్త పేరు పెట్టిన WHO
కరోనా సోకిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చి దాదాపు 15వేల పేషెంట్లను ఆరోగ్యవంతులుగా తిరిగి ఇంటికి పంపించినట్లు చైనా అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ చైనాకు రాకపోకలు తగ్గిపోయాయి. చాలా మేరకు ఉత్పత్తులకు తీవ్ర కొరత ఏర్పడింది. చైనా నుంచి పొరుగుదేశాలు ఎన్నో ఉత్పత్తులను దిగుమతి చేసుకునేవి, కరోనా దెబ్బకు మార్కెట్లకు సైతం కలిసిరావడం లేదు.