China Corona Update: చైనాలో కొవిడ్​ కల్లోలం- రెండేళ్ల తర్వాత మరణాలు నమోదు!

China Corona Update: చైనాలో కొవిడ్​ కేసులకు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా డ్రాగన్​ దేశంలో కరోనా అదుపులో ఉండగా.. ఇప్పుడు కేసుల భారీగా నమోదవుతున్నాయి. రెండేళ్ల తర్వాత కొవిడ్​ మరణాలు నమోదయ్యాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2022, 12:04 PM IST
  • చైనాను వణికిస్తున్న కొవిడ్​
  • ఆందోళనకరంగా ఒమిక్రాన్​ కేసులు
  • హాంకాంగ్​, దక్షిణ కొరియాలో కరోనా భయాలు
China Corona Update: చైనాలో కొవిడ్​ కల్లోలం- రెండేళ్ల తర్వాత మరణాలు నమోదు!

China Corona Update: కరోనా మహమ్మారి చైనాను మరోసారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే దాదాపు రెండేళ్లు చైనాలో రెండేళ్లపాటు అంతంత మాత్రంగానే ఉన్న కరోనా ప్రభావం.. తాజాగా తీవ్ర స్థాయికి చేరింది. ప్రస్తుతం కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రస్తుతం భారీగా నమోదవుతున్నాయి.

చైనాలో తాజాగా రెండు కరోనా మరణాలు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 2021 జనవరి తర్వాత చైనాలో కరోనా మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. రెండు మరణాలు జిలిన్​ ప్రావిన్స్​లోనే నమోదైనట్లు ఆరోగ్య విభాగ అధికారులు వెల్లడించారు. అందులో ఒకరు కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకోలేదని  అధికారులు గుర్తించారు.

ఇక శనివారం నమోదైన సామాజిక వ్యాప్తి కేసుల్లో 2,157 కేసులు కేవలం జిలిన్​ ప్రావిన్స్​లోనే నమోదైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జిలిన్ ప్రావిన్స్ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రయాణాలపై ఆంభలు విధించింది. ప్రావిన్స్​నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడుతోంది.

ఇక మార్చి నెలలో చైనా వ్యాప్తంగా 29 వేలకు పైగా సామాజిక వ్యాప్తి కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవడం 2019 తర్వాత ఇదే తొలసారి.

హాంకాంగ్​లోనూ రికార్డు స్థాయిలో కేసులు..

హాంకాంగ్​లోని కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శనివారం ఒక్క రోజే ఇక్క 16,583 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు శుక్రవారం నాటికే కరోనా కేసుల సంఖ్య హాంకాంగ్​ వ్యప్తంగా 10 లక్షలు దాటింది.

దక్షిణ కొరియాలో ఒమిక్రాన్​ భయాలు..

దక్షిణ కొరియాలో ఒమిక్రాన్​ కేసులు, మరణాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. భౌతిక దూరం నిబంధనలను సడలిస్తూ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణని దక్షిణ కొరియా ఆరోగ్య అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొరియా వ్యాప్తంగా 381,454 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 9,038,93కు పెరిగిందని స్థానిక వార్తా సంస్థ పేర్కొంది.

Also read: ఏడేళ్ల వయసులో టీచర్ అవమానించిందని.. 30 ఏళ్ల తర్వాత ఆమెను చంపిన యువకుడు.. 101 సార్లు కత్తితో పొడిచి..

Also read: Pakistan Missile Failed: పరువు పొగుట్టుకున్న పాకిస్తాన్.. అసలేం జరిగిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News