Queen Elizabeth II: అశ్రునయనాల మధ్య బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు..!

Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. చివరిసారి చూసేందుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది ప్రముఖులు తరలివచ్చారు.

Written by - Alla Swamy | Last Updated : Sep 19, 2022, 05:45 PM IST
  • క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు
  • వెస్ట్ మినిస్టర్ డీన్ డేవిడ్ హోయల్ ఆధ్వర్యంలో కార్యక్రమం
  • హాజరైన రాజ కుటుంబసభ్యులు, అతిథులు
Queen Elizabeth II: అశ్రునయనాల మధ్య బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు..!

Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరుగుతున్నాయి. వెస్ట్ మినిస్టర్ అబేలో అధికారిక లాంఛనాలతో కార్యక్రమం కొనసాగుతోంది. వెస్ట్ మినిస్టర్ డీన్ డేవిడ్ హోయల్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు సాగుతున్నాయి. అంతకముందు వెస్ట్ మినిస్టర్ హాల్ నుంచి అబే వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. అంతిమ యాత్రలో వివిధ దేశాల నుంచి వేలాది మంది అతిథులు, లక్షలాది మంది బ్రిటన్ పౌరులు తరలివచ్చారు. 

వెస్ట్ మినిస్టర్ అబేలో ప్రముఖ సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నివాళులు అర్పించారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు పలువురు ప్రముఖులు భారీగా పాల్గొన్నారు. వెస్ట్ వినిస్టర్ అబే చర్చిలోనే బ్రిటన్ రాజులు, రాణులు పట్టాభిషేకం జరగనుంది. 1947లో రాణి ఎలిజబెత్, ఫిలిప్‌ల వివాహం ఇక్కడే జరిగిందని అధికారులు తెలిపారు. వెస్ట్ మినిస్టర్ అబేలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. 

ఈ సమయంలో అక్కడున్న గంటను 96 సార్లు మోగించారు. రాణి మరిణించన సమయంలో ఆమె వయస్సు 96 కావడంతోనే అన్నిసార్లు గంట మోగించారు. వెస్ట్ మినిస్టర్‌ అబే చర్చిలో ప్రార్థనలు పూర్తైన తర్వాత..విండ్సర్ క్యాసిల్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. రాయల్ నేవీ స్టేట్ గన్ క్యారేజ్‌లో పార్థివదేహాన్ని తీసుకెళ్లనున్నారు. క్యారేజ్‌లో చివరిసారిగా 1979లో లార్డ్ మౌంట్ బాటెన్‌ అంత్యక్రియలు జరిగాయి. సన్నిహితుల సమక్షంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 చివరి సంస్కారాలు జరగనున్నాయి. రాజు ఫిలిప్ సమాధి పక్కనే ఎలిజబెత్‌ను ఖననం చేయనున్నారు. గతేడాది రాజు ఫిలిప్ కన్నుమూశారు. 

Also read:Viveka Murder Case: వివేక కేసులో ఏపీ ప్రభుత్వానికి షాక్‌ తగిలినట్లేనా..? సుప్రీం కోర్టు నోటీసులు..!

Also read:TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..నవంబర్ నెలకు శ్రీవారి టికెట్ల జారీ అప్పుడే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News