Covaxin: కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్‌పై మరోసారి అనుమానాలు తలెత్తుతున్నాయి. అత్యంత సమర్ధవంతమైందని కొంతమంది కితాబిచ్చినా..ఆ వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న దేశపు హెల్త్ రెగ్యులేటరీ మాత్రం కాదంటోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేదంటోంది.
కరోనా వైరస్(Coronavirus)మహమ్మారి బ్రెజిల్‌లో మరోసారి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దేశంలో రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బ్రెజిల్ ప్రభుత్వం(Brazil Government) భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్జిన్ 20 మిలియన్ డోసులను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఇండియా నుంచి బ్రెజిల్ దేశానికి వ్యాక్సిన్ సరఫరా అవుతోంది. అయితే కోవ్యాగ్జిన్ తయారీ ప్రమాణాలకు అనుగుణంగా లేదని బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ అన్విసా ఆరోపించారు.
అయితే భారత్ బయోటెక్ (Bharat Biotech) బ్రెజిల్ భాగస్వామి ప్రెసిసా మెడికామెంటోస్‌తో కలిసి ఒక ప్రకటనను విడుదల చేసింది. కోవాక్జిన్‌పై బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ చేసిన ప్రకటనలను సాక్షాధారాలతో నివృత్తి చేస్తామని తెలిపారు. వ్యాక్సిన్ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశామని అన్నారు. అంతేకాకుంగా కోవాక్జిన్(Covaxin) భారత్‌తో సహా ఐదు దేశాల్లో ఆమోదించారనే విషయాన్ని గుర్తుచేశారు. భారత్ బయోటెక్ మార్చి 8 న బ్రెజిల్లో టీకా అత్యవసర ఉపయోగం కోసం దరఖాస్తు చేసింది. మరోవైపు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా 918.08 మిలియన్ డాలర్ల కొత్త రుణాల్ని పంపిణీ చేసే ఉత్తర్వులపై బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో సంతకాలు చేశారు. బ్రెజిల్ దేశస్థులు వ్యాక్సిన్ కోసం బారులు తీరుతున్నారు.
Also read: Rafale Fighter Jets: భారత అమ్ములపొదిలోకి మరో 3 రాఫెల్ యుద్ధ విమానాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook