ఢాకాలో పడవ ప్రమాదం..మృతుల సంఖ్య 32 పైనే

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ( Bangladesh Capital Dhaka ) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని బురిగంగా నదిలో ( Buriganga river )  జరిగిన పడవ ప్రమాదంలో ( Boat Accident in Dhaka )  32 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో పడవలో 50 మంది వరకూ ప్రయాణీకులున్నారని సమాచారం..

Last Updated : Jun 29, 2020, 09:26 PM IST
ఢాకాలో పడవ ప్రమాదం..మృతుల సంఖ్య 32 పైనే

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ( Bangladesh Capital Dhaka ) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని బురిగంగా నదిలో ( Buriganga river )  జరిగిన పడవ ప్రమాదంలో ( Boat Accident in Dhaka )  32 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో పడవలో 50 మంది వరకూ ప్రయాణీకులున్నారని సమాచారం..

ఢాకా ( Dhaka Boat Accident ) నగరంలోని బురిగంగా నదిలో రెండు పడవలు పరస్పరం ఢీ కొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఎంవీ మార్నింగ్ బర్డ్ ( Mv Morning Bird boat )  అనే పడవ...ఎంవీ మొయూర్ ( Mv moyur boat ) అనే మరో పడవను ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢాకా-చాంద్ పూర్ జలమార్గంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో పడవలో 50 మంది ప్రయాణీకులున్నారు. ఇప్పటికే 32 మంది మృతదేహాల్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. గల్లంతైన మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఓల్డ్ ఢాకాలోని శ్యాంబజార్ ప్రాంతంలో సోమవారం ఉదయం మార్నింగ్ బర్డ్ పడవ మునిగిపోయింది. పడవ సామర్ధ్యం ప్రకారం 45 మంది వరకూ ఉందని..అయితే మరికొంతమందిని ఎక్కించుకోవడం వల్ల ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. 

Also read :  Amazon అమెజాన్ ఉద్యోగుల సమ్మెకు కారణం అదేనా….

ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ( Bangladesh PM Shaik Hasina ) విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు. Also read: Russian victory day parade: రష్యన్ విక్టరీ డే పేరేడ్‌లో ఇండియా దేనికి సంకేతం ?https://zeenews.india.com/telugu/world/will-russia-support-india-if-indo-china-war-arises-22664

Trending News